Traffic Advisory in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. నేటి నుంచే.. అంటే ఆగస్టు 24వ తేదీ నుంచే ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ స్పష్టంచేశారు.
పాత బస్తీలో ట్రాఫిక్ పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి.
1. పురానాపూల్ బ్రిడ్జి, మొజంజహీ బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ కాజ్వే, మూసారాంబాగ్ బ్రిడ్జి వైపు నుంచి ఓల్డ్ సిటీ, మలక్‌పేట్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనదారులు అవసరాన్నిబట్టి 100 ఫీట్ రోడ్, జియా గూడ, రామ్ సింగ్ పుర, అత్తాపూర్, ఆరాంఘర్, మైలార్ దేవ్ పల్లి చాంద్రాయణగుట్ట మీదుగా ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
2) మొజంజహీ మార్కెట్ నుండి నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి వెళ్లే వాహనదారులను రంగమహల్, చాదర్ ఘాట్, నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్ పుర్, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక వైపు మల్లించనున్నారు.
3) ఆబిడ్స్, కోటి వైపు నుండి చాదర్ ఘాట్ బ్రిడ్జి, చాదర్ ఘాట్ కాజ్వే, మూసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా మలక్‌పేట్, దిల్‌షుక్ నగర్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలను నింబోలిఅడ్డ, టూరిస్ట్ హోటల్ జంక్షన్, బర్కత్ పుర, ఫీవర్ హాస్పిటల్, తార్నాక లేదా 6 నెంబర్ జంక్షన్, రామంతపూర్ వైపు మల్లించనున్నారు.
4) ఓల్డ్ సిటీ నుండి నయాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి మీదుగా ఆబిడ్స్, కోటి, ఎంజే మార్కెట్, లక్డికాపూల్ వైపు వెళ్లే వాహనదారులు చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్ పల్లి, ఆరాంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, లక్డీకాపూల్ మార్గాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
5) దిల్‌షుక్‌నగర్, ఎల్బీ నగర్ వైపు నుండి మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, ఎస్జే బ్రిడ్జి మీదుగా ఆబిడ్స్, కోటి ఎంజే మార్కెట్ వైపు వెళ్లే వాహనాలు ఉప్పల్, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పుర మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.
మంగళహాట్, గోషామహల్ ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలను తీసుకుని సౌత్ జోన్ లేదా తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే వాహనదారుల కోసం ప్రత్యేక మార్గాలను సూచించారు. వినాయక విగ్రహాలతో ఓల్డ్ సిటీ వైపు వెళ్లే వాహనదారులు 100 ఫీట్ రోడ్, జియా గూడ, రామ్‌సింగ్‌పుర, అత్తాపూర్, ఆరాంఘర్, మైలార్‌దేవ్ పల్లి, చాంద్రాయణగుట్ట మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది.
గణేష్ చతుర్థి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో వినాయక విగ్రహాలు అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని మంగళహాట్, గోషామహల్ ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసుకుని సౌత్ జోన్ లేదా తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే వాహనదారుల కోసం సైతం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మార్గాలను సూచించారు.
వినాయక విగ్రహాలతో ఓల్డ్ సిటీ వైపు వెళ్లే వాహనదారులు 100 ఫీట్ రోడ్, జియా గూడ, రామ్‌సింగ్‌పుర, అత్తాపూర్, ఆరాంఘర్, మైలార్‌దేవ్ పల్లి, చాంద్రాయణగుట్ట మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. గణేష్ విగ్రహాలతో ఉప్పల్, దిల్‌షుక్‌నగర్, ఎల్బీ నగర్ వెళ్లే వాహనదారులు అఫ్జల్‌గంజ్, సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్), రంగమహల్, చాదర్‌ఘాట్, నింబోలిఅడ్డ, బర్కత్‌పుర, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక, హబ్సీగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
Also Read : Hyderabad Old City: నిఘా నీడలో పాతబస్తీ.. పెట్రోల్ బంకు, షాపులు బంద్!
Also Read : Hyderabad Violence: హైదరాబాద్‌లో హై అలర్ట్.. 7 గంటలకే దుకాణాలు బంద్.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి