Revanth Reddy On Minister KTR: మంత్రి కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోసం పోరాడింది కొండాలక్ష్మణ్ బాపూజీ అని.. కేకే మహేందర్ రెడ్డికి కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని అన్నారు. 2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ కేసీఆర్‌కు పార్టీ ఆఫీసు ఇచ్చి ఆశీర్వదించారని.. అలాంటి వ్యక్తి ఆఖరి చూపునకు కూడా కేసీఆర్ పోలేదన్నారు. కేసీఆర్ అంత దుర్మార్గుడు ఇంకొకరు ఉండరని ఫైర్ అయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఎక్కడైనా వినిపిస్తుందా..? అని అడిగారు. మహేందర్‌రెడ్డిని కాదని కేటీఆర్‌కు టికెటిచ్చారని.. ఓడినా ప్రజల మధ్య ఉన్న వ్యక్తి మహేందర్‌రెడ్డి అని కొనియాడారు.
'కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ పిచ్చి కుక్కలా మారి కరుస్తున్నారు. అలాంటి కుక్కను తరిమి తరిమి రాళ్లతో కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ ఇసుక దోపిడీకి, ధన దాహానికి దళిత బిడ్డ అడ్డుకుంటే.. వారిపై దాడులు చేయించాడు. ఓట్లేసిన సిరిసిల్ల ప్రజలను పోలీసుల బూట్లకింద కేటీఆర్ నలిపేస్తున్నాడు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించిన మీరాకుమారి గారిని అవమానించిన దుర్మార్గుడు కేసీఆర్. ఎస్సీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదు..? బండి సంజయ్ ఎవరికి లొంగిపోయాడు..? నివేదికను బయటపెట్టి దళితులపై దాడిచేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదు..?
ఎప్పటిలోగా దళితులపై దాడులు చేసిన వారిని శిక్షిస్తారో బండి సంజయ్ చెప్పాలి. కూలీ డబ్బులు తప్ప ప్రభుత్వం తమకు చేసిందేం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం సిరిసిల్ల నేతన్నలను ఎందుకు అడుకోవడంలేదు..? ఈ సిరిసిల్లకు పట్టిన కొరివి దయ్యాన్ని వదిలించండి. కేటీఆర్ తెలంగాణ కుటుంబ సభ్యుడు కాదు. దండుపాళ్యం ముఠా సభ్యుడు మాత్రమే. పోలీసుల పహారా మధ్య ప్రగతి భవన్.. పాకిస్తాన్ ఇండియా బార్డర్‌ను తలపిస్తోంది. అమరుల కుటుంబాలను ప్రగతి భవన్‌కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదు. నువ్వు తెలంగాణ కుటుంబం ఎట్లా అయితవ్.
కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలకు తరమాలి. ఉద్యమకారులంతా ఆస్తులు పోగొట్టుకుంటే.. కేటీఆర్‌కు ఇన్ని కోట్ల ఆస్తులేలా వచ్చాయి..? నువ్వు ఉద్యమకారుడివా..? పేద బిడ్డలు ప్రగతి భవన్‌కు వచ్చేలా ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టు.. అప్పుడే నువ్ తెలంగాణ కుటుంబ సభ్యుడివని నమ్ముతాం..' అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సమంత పేరును తెరపైకి తీసుకువచ్చారు. పొద్దున లేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే తిరుగుతున్నాడని కామెంట్స్ చేశారు. మన చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతను నియమించి సిరిసిల్లకు తీసుకువచ్చారని అన్నారు. మాకు సమంత వద్దని.. అగ్గిపెట్టె పట్టే చీరలో వేసే చేనేత కార్మికులకు సమంత సోకులు వద్దని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
Also Read: IMA On Antibiotics: భారీగా పెరుగుతున్న దగ్గు, జ్వరం కేసులు.. ఈ మందులు అస్సలు వాడకండి
Also Read: Andrey Botikov: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త హత్య.. బెల్టుతో గొంతు కోసి దారుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook