TSRTC Telangana Tourism Packages: హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. హైదరాబాద్ నుండి వివిధ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేకమైన బస్సు సర్వీసులను ప్రారంభించిన టిఎస్ఆర్టీసీ.. తాజాగా ఆ సేవలను మరింత విస్తరింపజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకృతి ప్రేమికులైన పర్యాటక యాత్రికులకు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించారు. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే విధంగా ఆర్టీసి సంస్థ నేరుగా పర్యాటక ప్రదేశాలకు బస్సు సర్వీసులను నడపడం జరుగుతుందని తెలిపారు. విహార యాత్రలు చేసేవారికి అనువుగా ఆర్టీసి బస్సు సౌకర్యాలు అందించడం జరుగుతుందని, ప్రజలందరూ ఆర్టీసీ సంస్థను ఆదరించాలని బాజిరెడ్డి గోవర్థన్ విజ్ఞప్తి చేశారు.
పోచంపాడు, పొచ్చేర, కుంటాల జలపాతాలకు టిఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్టు బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. బాజిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి ఉదయం 5 గంటలకు బయలుదేరు ఫ్లాట్‌ఫామ్ నెంబర్లు 55, 56 ఈ ప్లాట్‌ఫామ్స్‌లలో హైదరాబాద్ నుండి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు నేరుగా పర్యాటక ప్రదేశాలకు ప్రయాణికులను చేర్చడం జరుగుతుంది.
జేబీఎస్ బస్ స్టేషన్ నుండి ఉదయం 5:30 గంటలకు ప్లాట్‌ఫాం నెంబర్ 20.
ఈ బస్సు సర్వీసులలో ఉదయం 7:00 గంటలకు అల్పాహారం తూప్రాన్ వద్ద అందించడం జరుగుతుంది.
పర్యాటక ప్రదేశాల వివరాలు.
1. పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వీక్షించే సమయం.
ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
2. పొచ్చేరా జలపాతం వీక్షించే సమయం.
మధ్యాహ్నం 12 :15 నుండి 1:30 వరకు పొచ్చెరా అందాలను వీక్షించే అవకాశం.
3. కుంటాల జలపాతం వీక్షించే సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వీలు ఉంటుంది. మధ్యాహ్నం కుంటాల పరిసర ప్రాంతాల్లోనే భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారు.
మూడు ప్రాంతాలను వీక్షించిన అనంతరం ప్రయాణికులు తిరిగి టిఎస్ఆర్టీసీ బస్సుల్లో రాత్రి 10:45 గంటలకు హైదరాబాద్ చేరుకోవచ్చు. మొత్తం మూడు పర్యాటక ప్రదేశాలకు కలిపి ఒక్కొక్కరికి పెద్దలకు ₹ 1099 /- పిల్లలకు 599/-
నిజామాబాద్ నుండి కుంటాల జలపాతంకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని టిఎస్ఆర్టీసీ వెల్లడించింది. నిజామాబాద్ ప్రధాన బస్ స్టేషన్ నుండి ప్రతీ ఆదివారం ఉదయం 8:00 గంటలకు ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ బస్సు నిజామాబాద్ నుండి పోచ్చెర జలపాతం వద్దకు 10:15 నిమిషాలకు చేరుకుంటుంది. పోచ్చేర జలపాతం నుండి కుంటాల జలపాతం వద్దకు మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి మళ్లీ సాయంత్రం 5 గంటలకు ప్రయాణికులను నిజామాబాద్ చేరుస్తుందని బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. అడల్ట్ ఫేర్ 420 రూపాయలు, పిల్లలకు ఫేర్ 200 చార్జీలు వసూలు చేయడం జరుగుతుందన్నారు. పెద్దలకు 200 రూపాయలు, పిల్లలకు 110 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. అదే సమయంలో అల్పాహారం, భోజన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
టిఎస్ఆర్టీసి వెబ్‌సైట్‌ను www.tsrtconline.in లోకి లాగిన్ అవడం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించగలరు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను ఎక్స్కార్షన్కి వెళ్లే కళాశాల విద్యార్థులు, యాజమాన్యాలు, పాఠశాల విద్యార్థులు, యాజమాన్యాలు, ప్రకృతి ప్రేమికులు, విహారయాత్రలు చేసేవారు సద్వినియోగం చేసుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
Also Read : Brahmastra Pre-Release Event: బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కేసీఆర్ సర్కారు ?
Also Read: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి