LRS last date In Telangana: నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్ గ‌డువు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానంతోపాటు భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని (LRS) సైతం అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆగస్తు 31న ఈ పథకాన్ని ప్రారంభించింది.

Last Updated : Oct 31, 2020, 08:59 AM IST
LRS last date In Telangana: నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్ గ‌డువు

Land Regularisation Scheme: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానంతోపాటు భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని (LRS) సైతం అమల్లోకి తీసుకొచ్చింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆగస్తు 31న ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ ఎల్ఆర్ఎస్ తుది గడువు (LRS last date In Telangana) నేటి (అక్టోబర్ 31)తో ముగియనుంది. వాస్తవానికి అక్టోబరు 15న దీని గడువు ముగియాల్సి ఉంది. అప్పుడు రాష్ట్రంలో వర్షాలు, వరదలు సంభవించడంతోపాటు.. పలు కారణాల వల్ల ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తుది గడువును మరో 15 రోజుల పాటు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. Also read: Turkey Earthquake: 17కి చేరిన మృతుల సంఖ్య.. వందలాది మందికి గాయాలు

ఇదిలాఉంటే.. ప్రారంభం నాటి నుంచి నిన్న‌టివ‌ర‌కు (అక్టోబరు 30) 24,14,337 ల‌క్ష‌ల ఎల్ఆర్ఎస్ (Land Regularisation Scheme ) ద‌ర‌ఖాస్తులు వ‌చ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు గ్రామపంచాయ‌తీల్లో 10,17,293 ద‌ర‌ఖాస్తులు రాగా, ముసినిపాలిటీల్లో 10,02,325 దరఖాస్తులు, కార్పోరేష‌న్ల‌లో 3,94,719 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈ రోజుతో ఎల్ఆర్ఎస్ ద‌ర‌ఖాస్తుల గడు ముగియనుండటంతో.. ఈ రోజు ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశముంది. 
Also read: Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News