ఒక్క ఐడియా జీవితాన్ని మార్చినట్లు ..ఒక్క పోస్టు జీవితాన్ని నాశనం చేసింది. మరికాసేపట్లో జరిగాల్సిన పెళ్ళి ఒక్క ఫేస్ బుక్ పోస్టుతో ఆగిపోయింది. స్థానిక మీడియా కథనం ప్రకారం తన సహ ఉద్యోగి వధువుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు.
వివరాల్లోకి వెళ్లినట్లయితే వరంగల్ కు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ పని చేస్తున్నాడు. తన సహా ఉద్యోగిని (పెళ్లికూతురు ) ఫొటోలు సేకరించిన ప్రకాంత్..తామిద్దరూ కలిసి దిగినట్లుగా మార్ఫింగ్ చేసి...ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
ఆదివారమే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో యువతి వివాహం జరగాల్సి ఉంది. ఫేస్‌బుక్‌లో ఆమె ఫొటోలను చూసిన వరుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.