TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..

RTC MD Sajjanar:  తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 13, 2024, 05:44 PM IST
  • ఆర్టీసీ టికెట్ ధరల్లో పెంపులో వాస్తవంలేదు..
  • వివరాలు వెల్లడించిన సంస్థ..
TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్..  టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్  విషయంలో క్లారిటీ..

TGRTC MD Sajjanar on RTC Charges Rumours: తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రసారం జరిగింది. చాలా మంది దీనిపై ఆర్టీసీ అధికారులకు ఫోన్ లు చేసి మరీ ఆరాతీశారు. మరికొందరైతే  ఏకంగా ప్రయాణికులపై ఆర్టీసీ చెప్పలేని భారం మోపుతుందని కూడా సోషల్ మీడియావేదికగా రూమర్స్ ను స్ప్రెడ్ చేశారు. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీ పెంపు వార్తలలో ఎండీ సజ్జనార్ క్లారీటి ఇచ్చారు.

Read more: Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు కోర్టు..

కేంద్రం టోల్ ఛార్జీలు పెంచిన క్రమంలో.. తెలంగాణలోని ఎక్స్‌ప్రెస్ బస్సులో టోల్ రుసుమును ఒక్కో కౌంటర్‌కు పది నుంచి 13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో 13 నుంచి 16 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇక.. గరుడ ప్లస్ బస్సుల్లో 14 నుంచి 17 రూపాయలకు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో..  రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 నుంచి రూ. 23కు పెంచినట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో..  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రంనిజం లేదని అన్నారు.  ఆర్టీసీ బస్సులలో.. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉంటాయని తెలిపింది.  ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఆర్టీసీ.. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్‌ను సవరించుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ సవరించిన టోల్ సెస్ జూన్ 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

Read more: NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..

టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను సవరించి,  సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొందరు ఉద్దేష పూర్వకంగా టీఎస్ఆర్టీసీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆర్టీసీ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ, సంస్థ సీరియస్ గా స్పందించింది. ఇక మీదట..  తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం  కఠిన చర్యలు  తీసుకుంటామని టీఎస్ ఆర్టీసీ హెచ్చరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News