Emotional Video: భర్త సమాధి వద్ద మహిళ పెళ్లిరోజు వేడుక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

రోజూ మాట్లాడే వ్యక్తి నుంచి చిన్న గ్యాప్ వస్తేనే ఏదో వెళితిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి శాశ్వతంగా దూరమైతే మరిచిపోవడం అంత సులువు కాదు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ బాధను వర్ణించడం ఎవరి వల్లా కాదు. అలాంటి ఓ కష్టమైన, విషాదకరమైన పరిస్థితి వచ్చిన ఓ మహిళ.. తాజాగా చేసిన ఓ పని ఇప్పుడు అందరనీ కంటతడి పెట్టిస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 09:00 PM IST
  • భర్త సమాధి వద్ద పెళ్లి రోజు వేడుక
  • కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
  • అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
Emotional Video: భర్త సమాధి వద్ద మహిళ పెళ్లిరోజు వేడుక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

Emotional Video: రోజూ మాట్లాడే వ్యక్తి నుంచి చిన్న గ్యాప్ వస్తేనే ఏదో వెళితిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి శాశ్వతంగా దూరమైతే మరిచిపోవడం అంత సులువు కాదు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ బాధను వర్ణించడం ఎవరి వల్లా కాదు. అలాంటి ఓ కష్టమైన, విషాదకరమైన పరిస్థితి వచ్చిన ఓ మహిళ.. తాజాగా చేసిన ఓ పని ఇప్పుడు అందరనీ కంటతడి పెట్టిస్తోంది.

ఇంతకీ ఏమైందంటే..

జగిత్యాల జిల్లా వెల్లటూర్​కు చెందిన సుదర్శన్‌తో 2014 మార్చి 3న ప్రవళికకు వివాహమైంది. అప్పటి నుంచి ఎంతో సంతోషంగా సాగిన వారి జీవితం ఉన్నట్టుండి ఓ ఊహించని మలుపు తిరిగింది. వారి ఆనందం చూసి విధికి కన్నుగిట్టిందేమోగానీ.. సుదర్శన్​ను గత ఏడాది ప్రవళిక నుంచి దూరం చేసింది. సుదర్శన్ ప్రాణాలు కోల్పోవడంతో ప్రవళిక ఒంటరై.. భర్త జ్ఞాపకాలతో జీవితం సాగిస్తోంది. ఎంతో బాధ పడుతూనే జీవితాన్ని సాగిస్తోంది. ఇదిలా ఉండగా.. భర్త మరణం తర్వాత తాజాగా పెళ్లి రోజు వచ్చింది. దీనితో భర్త లేకుండానే పెళ్లి రోజు జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రవళిక తీవ్ర భావోద్వేగానికి లోనైంది.

భర్త జ్ఞాపకాలతో పెళ్లిరోజును జరుపుకోవాలని నిర్ణయించకున్న ప్రవళిక.. భర్త ఉన్నప్పుడు పెళ్లి రోజును ఎలా జరుపుకునే వారో అలాగే అన్నింటిని సిద్ధం చేసుకుంది. అయితే ఈ ఏర్పాట్లు చేసింది ఇంట్లో కాదు. భర్త సమాది దగ్గర అన్ని ఏర్పాట్లు చేసి.. కేక్​ కూడా కట్​ చేసింది ఆ మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా.. ఆది చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు. భర్త సమాధిని పూలతో అలంకరించి ఆ మహిళ పెళ్లి రోజును జరుపుకోవడం చూసిన వారంతా.. ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

వీడియో కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి--- Emotional Viral Video: భర్త సమాధి వద్దే కేక్ కట్ చేసి పెళ్లి రోజు వేడుక.. కన్నీళ్లు తెప్పిస్తున్న వైరల్ వీడియో

భర్త తనతో లేకపోయినప్పటికీ.. అతడితో జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆ రోజు ఆమె అతడి సమాధి వద్దే గడిపేయడం చూసి కన్నీళ్లు పెట్టుకోని వాళ్లు లేరు. దేవుడు ఇలా సంతోషంగా జీవించే వాళ్లను ఎందుకు కష్టపెడతాడో అని కొందరు... ఇలాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడని, ఎంతో బాధాకరమని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. తోడు కోల్పోవడం అనేది ఎన్నటికీ భర్తీ చేయలేని లోటు అని నెటిజెన్స్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.

Also read: TS Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..

Also read: TSRTC Offer: ఆర్​టీసీ స్పెషల్ ఆఫర్.. వారికి సిటీ బస్సుల్లో ఆ 2 గంటలు ఉచిత ప్రయాణం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News