Special Buses For Men: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మార్గాలలో ఎక్కడ చూసిన మహిళలతోనే బస్సులన్ని ఫుల్ గా నిండిపోతున్నాయి. కొన్ని చోట్ల మహిళలే సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టేసుకుంటున్నారు. ఇక పురుషులు మాత్రం టికెట్ కొని మరీ సీటు దొరక్క బిక్కు బిక్కు మంటూ నిలబడి ప్రయాణిస్తున్న పరిస్థితి ఏర్పడింది.
అనేక చోట్ల పురుషులు కూడా తమకు కూడా మహిళల మాదిరిగా స్పెషల్ బస్సులను నడపాలని సజ్జనార్ కు అనేక మార్లు విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీఎస్ఆర్టీసీ దీనిపై చర్యలకు ఉపక్రమించింది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు.. తొలుత దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా కింద పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ల మధ్య ఒక్క బస్సును నడిపిస్తుంది.
ప్రయాణికుల నుంచి దీనికి వచ్చే రెస్పాన్స్ ను బట్టి మరిన్ని మార్గాలలో పురుషుల కోసమే స్పెషల్ బస్సులను విస్తరించడంపై నిర్ణయం తీసుకొనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే.. పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడిపడం పట్ల అనేక మంది ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook