Puvvada Ajay Kumar tested Covid-19 positive: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా ( Coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన మరో ప్రజాప్రతినిధి కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar ) కు కరోనావైరస్ పాజిటివ్ (Covid-19 positive) గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించారు. సోమవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ఆయన వెల్లడించారు. Also read; Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 15, 2020
తనకు కరోనా సోకిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అజయ్ కోరారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లోని ఉన్నానని.. ఎవరూ తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఎవరూ కూడా తనకు ఫోన్ చేయడానికి కానీ.. కలవడానికి కానీ ప్రయత్నించవద్దని సూచించారు. మళ్లీ యథావిథిగా తమ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటూ మంత్రి అజయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook