జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణ బెస్ట్

జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) వసూళ్ళలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

Last Updated : Jul 8, 2018, 08:38 PM IST
జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణ బెస్ట్

జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) వసూళ్ళలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సెంట్రల్ జీఎస్‌టీ చీఫ్ కమిషనర్ బీబీ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 36 జీఎస్టీ కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. తాము జీఎస్టీపై వస్తున్న అపోహలను తొలిగించడానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపు, రిటర్న్‌ల దాఖలును సులభతరం చేసేందుకు తాము పలు కొత్త విధానాలను తీసుకురానున్నట్లు బీబీ అగర్వాల్ పేర్కొన్నారు.

ఇటీవలే జీఎస్టీ అవగాహన సదస్సుకు హాజరు కావడం కోసం తెలంగాణ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నకిలీ జీఎస్‌టీ నెంబర్లతో వినియోగదారులను మభ్యపెట్టే వారిపై కూడా తాము చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. అందుకోసం తాము ప్రత్యేకంగా ఒక యాప్ కూడా రూపొందించామన్నారు. ఈ యాప్‌లో జీఎస్టీ నెంబర్ ఎంటర్ చేసి దానిని వెరిఫై చేసుకోవచ్చని అగర్వల్ తెలిపారు. 

అలాగే తాము నకిలీ జీఎస్టీ నెంబర్ల గురించి వినియోగదారులెవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అగర్వాల్ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపార సంస్థల యజమానులు అడిగిన ప్రశ్నలకు కూడా అగర్వాల్ బదులిచ్చారు.  వినియోగదారుల కోణం నుంచి చూస్తే జీఎస్టీ వల్ల వస్తువుల మీద మొత్తం పన్ను భారం అంచనాల మేరకు 25 నుంచి 30 శాతం వరకూ తగ్గనుండడం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాష్ట్ర సరిహద్దుల్లో పన్ను చెల్లింపుల గురించి గంటల పాటు నిలుపుదల లేకుండా రవాణా సాగడం, పెద్ద ఎత్తున రాతకోతలు తగ్గుదల వంటి ప్రయోజనాలు లభిస్తాయని గతంలో ప్రభుత్వం తెలిపడం గమనార్హం

Trending News