TTD Temple: కరీంనగర్‌లో శ్రీవారి ఆలయం పనులు షురూ..త్వరలో టెంపుల్ డిజైన్లు..!

TTD Temple: త్వరలో కరీంనగర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయం రాబోతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనులు చకచక జరుగుతున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : May 28, 2022, 07:44 PM IST
  • త్వరలో కరీంనగర్‌లో శ్రీవారి ఆలయం
  • డిజైన్లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
  • టీటీడీ టెంపుల్‌ను పరిశీలించిన మంత్రుల బృందం
TTD Temple: కరీంనగర్‌లో శ్రీవారి ఆలయం పనులు షురూ..త్వరలో టెంపుల్ డిజైన్లు..!

TTD Temple: త్వరలో కరీంనగర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయం రాబోతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనులు చకచక జరుగుతున్నాయి. ఇందులోభాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న వెంకటాచల టీటీడీ టెంపుల్‌ను మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న ఆలయం, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆగమ, వాస్తు శాస్త్రం, ఆలయ నిర్మాణ శైలి, గర్భాలయం, అంతరాలయం, అర్ధమండపం, మహా మండపం, ముఖ మండప విషయాలను అధికారులను అడిగి తెసుకున్నారు. 

గరుడాళ్వార్ సన్నిధి, ధ్వజస్తంభం, బలిపీఠం, తూర్పు రాజగోపురం, ఉత్తర ద్వారం, ప్రాకార మండపాలపై ఆరా తీశారు. గతంలో జూబ్లీహిల్స్‌లోని శ్రీవారి ఆలయాన్ని సైతం ఆయన పరిశీలించారు. కరీంనగర్ నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన పది ఎకరాల స్థలాన్ని ఆలయానికి సీఎం కేసీఆర్ కేటాయించారు. దీనికి టీటీడీ బోర్డు నుంచి ఆమోదం లభించింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా స్థల మంజూరు పత్రాలను అందుకున్న మంత్రి గంగుల..టీటీడీ ఆలయాలను పరిశీలిస్తున్నారు. 

ఈక్రమంలోనే అమరావతిలోని ఆలయానికి వెళ్లారు. దాదాపు రెండుగంటలపాటు ఆలయాన్ని పరిశీలించారు. అక్కడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అధికారుల నుంచి మరిన్ని వివరాలపై ఆరా తీశారు. రేపు కరీంనగర్‌లో నిర్మాణం కాబోతున్న టీటీడీ ఆలయాన్ని తిరుమల శ్రీవారి ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఆలయ డిజైన్లను మంత్రి గంగుల కమలాకర్‌ను అందించనున్నారు.  

తెలంగాణ ప్రభుత్వం..ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు మంత్రి గంగుల కమలాకర్‌. యాదాద్రి ఆలయాన్ని అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయం సైతం అత్యద్భుతంగా నిర్మించామన్నారు. ఇప్పటికే పూర్వ కరీంనగర్‌ జిల్లాకు ఆధ్యాత్మికంగా మంచి పేరు ఉందని గుర్తు చేశారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలు ఉన్నాయని తెలిపారు. త్వరలో టీటీడీ ఆలయం రాబోతోందన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి గంగుల వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు, టీటీడీ తెలంగాణ అడ్వైజర్ కమిటీ ఛైర్మన్ భాస్కరరావు, ఇతర అధికారులున్నారు. 

 

Also read:Monkeypox Alert: కోరలు చాస్తున్న మంకీ పాక్స్‌..తెలంగాణ సర్కార్ అలర్ట్..!

Also read:YS Sharmila: కాంగ్రెస్ కుల రాజకీయం, బీజేపీ మత రాజకీయం... రేవంత్, బండి సంజయ్‌లను ఏకిపారేసిన వైఎస్ షర్మిల...   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News