Telangana:రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. తెలంగాణ అధికారిక చిహ్నాం ఆవిష్కరణ వాయిదా వేస్తు ఉత్తర్వులు.. కారణం ఏంటంటే?

TS Emblem annoucement postpone: తెలంగాణ అధికారిక లోగో ఆవిష్కరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రా ఆవిర్బావ వేడుకల రోజున ఆవిష్కరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగిన విషయం తెలిసిందే.

Written by - Inamdar Paresh | Last Updated : May 30, 2024, 03:08 PM IST
  • తెలంగాణ ఎంబ్లమ్ విషయంలో కీలక నిర్ణయం..
  • లోగోను ఆవిష్కరించడంలేదని ప్రకటన..
Telangana:రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..  తెలంగాణ అధికారిక చిహ్నాం ఆవిష్కరణ వాయిదా వేస్తు ఉత్తర్వులు.. కారణం ఏంటంటే?

TS Emblem annoucement postpone: జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ప్రభుత్వం, అధికారులను ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులు కూడా దగ్గరుండి, ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయడంలో బిజీ అయిపోయారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకలకు హజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి ఆహ్వానించిన విషయం తెలసిందే.

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

తెలంగాణను ఇచ్చిన తల్లిగా.. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. మరోవైపు అనేక మంది ఢిల్లీ పెద్దలను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణలో జరిగే వేడుకలకు హజరు కావాలని కోరారు. ఇక మరోవైపు తెలంగాణ గీతం, లోగోలలో అనేక మార్పులు తీసుకొరావాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం బాధ్యతలను అందెశ్రీకి అప్పగించారు. అందె శ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటకు, సంగీత మాంత్రికుడు ఎంఎం కీరవాణి తన స్వరాలతో తుదిమెరుగులు దిద్దుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం, లోగోలపై సీఎం రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, కోదండరామ్, అందె శ్రీ, కీరవణిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర గీతంలో,  లోగోలలో అనేక మార్పులను సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్రగీతం దాదాపుగా పూర్తిగా కావొచ్చింది. కానీ లోగో విషయంలో వందల మంది నుంచి సూచనలు వస్తున్నాయి. దీనిపై పునారాలోచించాలని, వివిధ పార్టీల నేతలు, మేధావుల నుంచి వినతులు రావడంతో దీనిపై పునారాలోచిస్తున్నామని, ఇప్పటికైతే.. తెలంగాణ లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రగీతం ను మాత్రం జూన్ 2 ఆవిష్కరిస్తామని రేవంత్ ప్రభుత్వ స్పష్టం చేసింది.

కొత్త లోగోలో ఏముందంట..?

సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాల లోగోలను పరిశీలించినట్లు తెలుస్తోంది. కొత్త లోగోలో.. చట్టం, న్యాయం, ధర్మానికి గుర్తులైన మూడు సింహాలను చిహ్నాంపై భాగంలో పొందుపర్చినట్లు అనేక లోగోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కొత్త లోగోలో.. కాకతీయ కళాతోరణం, చార్మినార్, అమరవీరుల స్థూపం, బతుకమ్మ బోనాలకు సంబంధించిన అనేక చిహ్నాలు వార్తలో నిలిచాయి. కాంగ్రెస్ దాదాపుగా యాభైకి పైగా చిహ్నాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక మరో రెండు రోజులు మాత్రమే ఉత్సవాలకు సమయం ఉన్న నేపథ్యంలో.. అనేక ప్రతిపాదనలు రావడంతో దీనిపైన ఎటు తెల్చుకొలేక పోయినట్లు తెలుస్తోంది.

అందుకే దీని కోసం మరింత సమయం కేటాయించి, అందరికి ఆమోద యోగ్యమైన లోగోను ఎంపిక చేద్దామని రేవంత్ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో తెలంగాణ ఎంబ్లమ్ ను ఆవిష్కరించడంలేదని సీఎం రేవంత్ సర్కారు  అధికారికంగా ప్రకటించింది.

Read more: Bihar teachers reels: ఎగ్జామ్ పేపర్లు దిద్దుతూ లేడీ టీచర్ ల పాడుపని.. ఏకీ పారేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రగీతంకు స్వరం కోసం కీరవాణిని ఎంపిక చేయడం కూడా తీవ్ర దుమారంకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి మరల తెలంగాణ, అస్తిత్వాన్ని ఆంధ్రవాళ్ల కాళ్లదగ్గర పెట్టాడంటూ, బీఆర్ఎస్ నేతలు, ఉద్యమ కారులు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమం, భావోద్వేగాలతో సంబంధించిన అంశమని,  ఆయనకేం తెలుస్తోందని అనేక మంది మేధావులు కూడా దీనిపైన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News