Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ

Flood Relief Rehabilitation Funds: వరద సహాయం నిధుల విడుదలపై తెలంగాణ రాజకీయ దుమారానికి తెరతీసింది. ఏపీకి కేటాయించిన వాటిలో సగం కూడా ఇవ్వకపోవడం దుమారం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 1, 2024, 11:35 PM IST
Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ

  Harish Rao vs BJP: వరద ప్రభావిత రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల్లో అన్యాయం చేయడంపై తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ మధ్య వివాదం రాజుకుంది. విడుదలైన నిధులపై రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు విడుదలైన వాటిలో సగం కూడా రాలేదని మండిపడ్డారు.

Also Read: NDRF Funds: రాష్ట్రాలకు కేంద్రం నిధుల వరద.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

జాతీయ విపత్తుల నిధులను అడ్వాన్స్‌గా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రూ.1,345 కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే మిగిలిన నిధులను విడుదల చేసేందుకు సిద్దమని సెప్టెంబర్ 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి, రెండో విడత ఇన్‌స్టాల్‌మెంట్ నిధులను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్‌లో రూ.208.40 కోట్లను తెలంగాణకు వచ్చాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు రూ.4343 కోట్లను విడుదల చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు బండి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Musi Demolish: మూసీ కూల్చివేతలు కేసీఆర్‌ మొదలుపెట్టిండు మేం కాదు: మంత్రి శ్రీధర్‌ బాబు

ఇక మరో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా నిధుల విడుదలపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా 'ఎక్స్‌' వేదికగా ఓ పోస్టు చేశారు. 'ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు నిధులు కేటాయించి సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని కిషన్‌ రెడ్డి తెలిపారు. '14 వరద ప్రభావిత రాష్ట్రాలతో సహా తెలంగాణ రాష్ట్రానికి రూ.416 కోట్ల నిధులు విడుదల చేయడంతో వరద బాధితులకు పునరావాస ప్రయత్నాలను వేగవంతం అవుతాయి. వరద బాధితుల అవసరాలను కూడా త్వరగా తీర్చడంలో సహాయ పడుతుంది' అని పేర్కొన్నారు.

హరీశ్‌ రావు విమర్శలు
కాగా విడుదలైన నిధులు చూస్తే పక్క రాష్ట్రం ఏపీలో సగం కూడా రాలేదు. కేంద్ర బడ్జెట్‌లో ఇప్పుడు వరద సహాయ నిధుల్లో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయమై గులాబీ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై.. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తెలంగాణ బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు గుండు సున్నా. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లలో తెలంగాణకు మొండిచెయ్యి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల కేటయింపుల్లో తెలంగాణకు అంధ్రతో పోలిస్తే సగం కంటే తక్కువ కేటాయింపులు. ఇదే నా సబ్ కా సాథ్ సబ్ గా వికాస్???' అని హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

Trending News