Azadi Ka Amrit Mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతా ఆలాపన చేయాలని తెలంగాణ సర్కారు నిన్నటి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ భావాన్ని పెంపొందించేలా, దేశభక్తి భావం ఉట్టిపడేలా తెలంగాణలోని గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాలు, ప్రధానమైన ట్రాఫిక్ జంక్షన్స్, ముఖ్యమైన ల్యాండ్ మార్క్స్, పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు వంటి రద్దీ ప్రాంతాల్లో అందరూ కలిసి జాతీయ గీతాలాపన చేయాల్సిందిగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, మెజిస్ట్రేట్స్‌తో ఆయా జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్స్‌తో కలిసి సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే సామూహిక గీతాలాపన చేపట్టాల్సి ఉందో.. ఆయా స్థలాలను ముందే గుర్తించనున్నట్టు ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. లోకేషన్స్ వారీగా ఆయా స్థలాల్లో సామూహిక జాతీయ గీతాలాపన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను ఏర్పాటు చేయనున్నారు. వివిధ విభాగాల్లోని స్థానిక ఉన్నతాధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. జాతీయ గీతాలాపన జరిగే వేదికల వద్ద ప్రసంగాలకు వీలుగా ఏర్పాట్లు చేపట్టనున్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతీ ఒక్కరు ఇందులో పాల్గొనాలని పౌరులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సామూహిక జాతీయ గీతాలాపన జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతీ ఒక్కరూ కదలకుండా, చప్పుడు చేయకుండా క్రమశిక్షణతో వ్యవహరించాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్ కోరారు.
Also Read : Munugode Byelection: ఎన్నికల షెడ్యూల్ రాకముందే మునుగోడుకు కేసీఆర్.. ఓటమి భయమా.. అసమ్మతికి చెక్ పెట్టడమా?
Also Read : Munugode Byelection: సీఎం కేసీఆర్ కు మునుగోడు నేతల షాక్.. కూసుకుంట్లను ఓడిస్తామని తీర్మానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook