Telangana Elections: నవంబర్ 30న ఎన్నికలు.. సీఎం కేసీఆర్ హ్యట్రిక్ కొడతారా..?

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే! తెలంగాణలో నవంబర్ 30న శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 05:48 PM IST
Telangana Elections: నవంబర్ 30న ఎన్నికలు.. సీఎం కేసీఆర్ హ్యట్రిక్ కొడతారా..?

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల జాతర మొదలైంది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో నవంబర్ 30న శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజీపీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. అయితే కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి పొత్తులు లేకుండా సొంతంగానే ఎన్నికల్లో పోటీచేయనున్నాయి. అయితే బీఆర్ఎస్, ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి మేమే వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై  ఓ సర్వే కూడా వచ్చింది. ఇందులో కాంగ్రెస్ దాదాపు 60కి పైగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. అయితే ఈ సర్వేను బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. తమ పార్టీయే అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెబున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా త్వరలోనే తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నాయి. 

నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలైపోయింది. ఇక అక్టోబర్ 16న ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి కూడా సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తారా లేదా హంగ్ వస్తుందా అనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా మరిన్ని సంక్షేమ పథాకాలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర పజల్లో ఎంతో ప్రభావాన్ని చూపాయి. 

ఇటీవల రైతులకు రుణమాఫీ చేయడం, అలాగే నిరుద్యోగుల కోసం గ్రూప్ నోటీఫికేషన్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ మరోసారి అధికారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈసారి ఎన్నికల కోసం విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఇంకా ఎలాంటి వరాలు కురిపిస్తారో అని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో తిరుగలేని నాయకుడిగా ఎదిగిపోయారు. ఈ మధ్య మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కూడా చురుకుగా జనాల్లోకి వెళ్లున్నారు. 

రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో  బెంగళూరు తర్వాత ఐటీ హబ్‌గా హైదరాబాద్ నిలిచింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో, రాష్ట్ర విధానల వల్ల ఐటీతో సహా అనేక పెట్టుబడులు వస్తున్నాయంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. ఇటీవలె ప్రభుత్వ పాఠశాలలో అల్పహార పథకాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో ఈసారి కూడా కేసీఆర్ అధికార పగ్గాలు చేపడతారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.   

Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా

మరోవైపు  కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.  అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ రూ.500 లకే ఇవ్వడం, మహిళలకు ప్రతినెల రూ.2500 ఆర్థిక సాయం, అర్హత గల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం, అలాగే రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇవ్వడం, వ్యవసాయ కూలీలకు రూ.12 ఇవ్వడం లాంటివి ఉన్నాయి. 

అలాగే ఇళ్లు లేని వారిని ఇంటి స్థలం కేటాయించి రూ.5 లక్షలు ఇవ్వడం, యువత కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు అందించడం లాంటివి ఉన్నాయి. అయితే ఇవి ప్రజల్లో కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయని.. బీజేపీ కంటే కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నిపుణలు చెబుతున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారన్న విషయం తెలిసిందే. 

అయితే ఇటీవల బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. దీంతో బీజేపీలో చాలావరకు ఊపు తగ్గిపోయినట్లు చాలామంది భావిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తామని.. అలాగే గిరిజన యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇవి కొంతమేరకు మాత్రమే ప్రభావం చూపగలవని.. కానీ కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.  

Also Read: Oppo A2X Price: అతి తక్కువ ధరతో మార్కెట్‌లోకి Oppo A2X మొబైల్‌..ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News