Telangana Polling live Updates: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యేసరికే పెద్దఎత్తున ఓటర్లు క్యూలైన్లలో నిరీక్షించసాగారు. సెలెబ్రెటిలైతే ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు మినహాయించి అంతా ప్రశాంతంగా సాగుతోంది.
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం వేళ కావడంతో చాలా చోట్ల క్యూలైన్లు ఎక్కువే కన్పిస్తున్నాయి. ముఖ్యంగాసెలెబ్రిటీలు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్‌లో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అదే ప్రాంతంలోని ఓబుల్ రెడ్డి స్కూలులో జూనియర్ ఎన్డీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణికొండలో మరో తెలుగు నటుడు వెంకటేశ్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులో సంగీత దర్శకుడు కీరవాణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక రాజకీయ నేతల్లో ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి, మంధనిలో శ్రీధర్ బాబు, వేల్పూరులో మంత్రి ప్రశాంత్ రెడ్డి, హనుమకొండ టీచర్స్ కాలనీలో కడియం శ్రీహరి, సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు, వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్లు అర్జున్ ఓటేసిన పోలింగ్ బూత్‌లో కూడా చాలా సేపు ఈవీఎం మొరాయించింది. కొన్ని చోట్లు ఈవీఎంలు మరమ్మత్తు చేయగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మార్చారు. ఈవీఎం మొరాయించిన సంఘటనలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎదురౌతూనే ఉన్నాయి.
Also read: TS Election 2023 LIVE Voting: ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్.. వీడియో చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook