Chennai Customs Notice To Revenue Minister Ponguleti Srinivasa Reddy Son: ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వెలుగుచూసిన ఘటన మాత్రం బీఆర్ఎస్ కు బలంచేకూర్చే విధంగా మారింది. మంత్రి పొంగులేటి కుమారుడు, హర్షారెడ్డి సింగపూర్ నుంచి రెండు లగ్జరీ వాచ్ లు తెప్పించినట్లు చెన్నై పోలీసులకు సమాచారం అందింది. ఇదివరకే అనేక స్మగ్లింగ్ కేసుల్లో ఇరుకున్న.. ముబీన్ అనే వ్యక్తితో లగ్జరీ వాచ్ లు తెప్పించినట్లు తెలుస్తోంది. దీనిలో ముబీన్, హర్షా ల దగ్గర నుంచి చెన్నై కస్టమ్స్ అధికారుల లగ్జరీ వాచీలను గుర్తించారు. అంతేకాకుండా.. దీనిలో నవీన్ అనే వ్యక్తి కూడా మధ్య వర్తిత్వం వహించినట్లు పోలీసుల విచారణలో తెలింది. ఇదిలా ఉండగా.. దీనిపై కస్టమ్స్ పోలీసులు ఫిబ్రవరి 5 న కేసు నమోదు చేశారు.
Read More: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..
అదే విధంగా ఈ ఘటనలో అనూహ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటీ హర్షారెడ్డి తెరమీద వచ్చింది. ఆయనకు ఇప్పటికే చెన్నై కస్టమ్స్ అధికారులు పలుమార్లు నోటిసులు ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగాలేదని, డెంగ్యూతో బాధపడుతున్నానని, ఏప్రిల్ 27 తర్వాత అధికారులకు సహకరిస్తానంటూ హర్షారెడ్డి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా.. భారత్ లో దొరకని, లగ్జరీ వాచ్ లు తెప్పించడంపై కూడ చెన్నై అధికారులు విచారణ చేపట్టారు.
ఆ వాచీల ఖరీదు రూ. కోటీ 75 లక్షల వరకు ఉంటుందన్నారు. అంతేకాకుండా..ఈ వాచీలను విదేశాల నుంచి సక్రమమైన విధానంలో టాక్సీలు కట్టి తీసుకొచ్చారా.. లేదా.. దొంగతనంగా స్మగ్లింగ్ కు పాల్పడ్డారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వాచీలకు హవాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
ఇందులో స్కామ్ ఏంలేదని కొట్టిపారేశారు. అయితే.. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో.. రాజకీయ కుట్రలో భాగంగా ఇలా చేశారా.. మరే ఇతర కోణముందా అనేది మాత్రం తెలవడానికి మరికొన్ని రోజులు మాత్రం వెచిచూడాల్సి ఉంటుంది. ఈ ఘటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో సంచలంగా మారింది. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు, బీఆర్ఎస్ లోకి వరుసపెట్టి జాయిన్ అయిపోతున్నారు. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. కడియం శ్రీహరి,కే కేశవరావు వంటి సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook