Revanth Reddy On Agnipath : ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన కొనసాగిస్తోంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మల్కాజ్ గిరిలో జరిగిన సత్యాగ్రహ దీక్షలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సత్యాగ్రహ దీక్షలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
మోడీకి పోయే కాలం వచ్చింది కాబట్టే ఆర్మీ జోలికి వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీల కోసమే అగ్నిపథ్ తీసుకొచ్చినట్లుగా ఉందన్నారు. జవానుగా 4 ఏళ్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. అగ్నివీరులు నాలుగేళ్లకే మళ్లీ నిరుద్యోగి అవుతారన్నారు. పోలీసులకే 9 నెలల ట్రైనింగ్ ఇస్తుంటే.. జవాన్లకు 6 నెలల శిక్షణ ఎలా సరిపోతుందని రేవంత్ ప్రశ్నించారు. ఆరు నెలల శిక్షణతో శత్రు దేశాలను ఎలా ఎదుర్కొంటారని నిలదీశారు. ఇజ్రాయిల్ విధానం ఫాలో అవుతున్నామని చెప్పడం సిగ్గు చేటన్నారు రేవంత్ రెడ్డి. కోటి జనాభా లేని దేశంతో భారత్ ను పోల్చడం దారుణమని మండిపడ్డారు. ఇజ్రాయిల్ దేశ జనాభా గ్రేటర్ హైదరాబాద్ జనాభా కంటే తక్కువ అన్నారు. ఇజ్రాయిల్ లో నిరుద్యోగ సమస్యలేదని.. మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నిరుపేద పిల్లలే ఆర్మీ వైపు వస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. రెండేళ్ల క్రితం ఫిజికల్ టెస్ట్ పాసైన అభ్యర్థులకు రాత పరీక్ష పెట్టకుండా రద్దుచేయడం వల్లే సికింద్రాబాద్ ఘటన జరిగిందన్నారు. రాకేష్ శవయాత్రను టీఆరెస్ నేతలు రాజకీయ యాత్రగా మార్చారని విమర్శించారు. దేశాన్ని కాపాడాలనుకున్న పిల్లలపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం సరికాదన్నారు. స్పెషల్ కోర్టు ద్వారా అసలు దోషులను శిక్షించి అమాయకులను వదిలేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినందుకే సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా ఈడీ ఆఫీస్ లో అడుగుపెడితే నాశనమై పోతావ్ అంటూ మోడీకి శాపనార్థాలు పెట్టారు.మోడీ విధానాలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కేసీఆర్ దీక్షకు దిగాలని, అగ్నిపథ్ పై నిలదీయాలన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆర్మీ అభ్యర్థుల కుటుంబాలకు అండగా ఉండాలన్నారు. కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆర్మీ అభ్యర్థులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు రేవంత్ రెడ్డి.రైతు చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఎలా పోరాటం చేశామో.. అలాగే అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read also: Rahul KTR: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం!
Read also: గర్వంగా ఉందంటూ.. మంత్రి కేటీఆర్‌పై సమంత ప్రశంసలు! విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి