Singareni Mines Privatization: సింగరేణి ప్రైవేటీకరణపై మండిపడ్డ KTR.. రెండు రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలా..?

KTR questions to Centrl Govt on Singareni Mines Privatization: తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై మోదీ ప్రభుత్వ వైఖరిని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. గనుల్ని వేలం జాబితా నుంచి తప్పించే విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర వైఖరిపై మండిపడ్డారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 04:05 PM IST
Singareni Mines Privatization: సింగరేణి ప్రైవేటీకరణపై మండిపడ్డ KTR.. రెండు రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలా..?

KTR Comments on Singareni Mines Privatisation: గనుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ కేంద్రాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు. ఒకే దేశంలోని రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు. తమిళనాడుకు ఓ న్యాయం, పక్కనున్న తెలంగాణకు మరో న్యాయమా అని విమర్శించారు. 

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనుల్ని వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చ్ 29వ తేదీన నోటిఫికేషన్ వెలువరించింది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఏవైనా టెండర్లు దాఖలు చేయవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. రాష్ట్రానికి లాభదాయకంగా ఉండి, దేశంలోనే అత్యధిక లాభాల్ని ఇచ్చే బొగ్గు గనుల్ని రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ నెల 12వ తేదీన ప్రీ బిడ్ సమావేశం జరగనుంది. గనుల దక్కించుకునేందుకు ఆసక్తి కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు టెండరు ప్రక్రియ గురించి తెలుసుకోవాలని మరో నోటిఫికేషన్ జారీ అయింది. 

తెలంగాణలోని సింగరేణి సహా మరో మూడు బొగ్గు గనుల్ని ప్రైవేటీకరించడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమిళనాడులోని గనుల్ని వేలం జాబితా నుంచి తొలగించిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల్ని వేలం నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు గనుల్ని వేలం జాబితా నుంచి తొలగించి ఆ గనుల్ని సింగరేణి సంస్థకు కేటాయించారని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనుల్ని వేలం నుంచి తొలగించడాన్ని ఈ సందర్భంగా ఉదహరింంచారు. ఒకే దేశంలోని రాష్ట్రాలని వేర్వేరు నిబంధనలు ఎందుకని కేటీఆర్ నిలదీశారు.

Also Read: EC Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

వాస్తవానికి ఈ వేలం జాబితాలో ముందు తమిళనాడులోని మూడు లిగ్మైట్ గనులు కూడా ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రం నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వేలం జాబితా నుంచి తొలగించింది. కానీ తెలంగాణ విషయంలో కేంద్రం మరోలా ప్రవర్తిస్తోందని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఇప్పటికే సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సింగరేణి బొగ్గు గనుల్లో తెలంగాణ వాటా 51 శాతం కాగా కేంద్రం వాటా 49 శాతముంది. అటువంటప్పుడు కేంద్రం సింగరేణిని ఎలా ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడుతున్నారు. 

Also read: Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన మోదీ.. ప్రయాణ సమయం ఎంతంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News