Minister Konda Surekha: దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుంది.. ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ..

Telangana: తెలంగాణలో పదేళ్లపాటు అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. మీ హయాంలో మహేందర్ రెడ్డిని అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టినప్పుడు ఆయన అవినీతి పరుడని గుర్తుకు రాలేదా.. అంటూ కొండా సురేఖా ఫైర్ అయ్యారు. 

Last Updated : Feb 8, 2024, 07:51 PM IST
  • - మీ హయాంలో మహేందర్ రెడ్డి తప్పలు కన్పించలేదా..?
    - ఎమ్మెల్సీ కవిత పై మండిపడిన మంత్రి కొండా సురేఖ..
Minister Konda Surekha: దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుంది.. ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ..

Minister konda Surekha Fires On BRS MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పదే పదే ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతుందో అర్థం కావట్లేదన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి, ప్రజలను అన్ని విధాలుగా దోచుకున్నారని బీఆర్ఎస్ మీద ఫైర్ అయ్యారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల దోపిడీ,నియమాలు చేపట్టలేదు, నిధులను సక్రమంగా ఉపయోగించలేదని దుయ్యబట్టారు.

Read More: Rava Upma: ఈ విధంగా ఉప్మా తయారు చేస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేయచ్చు!

మహేందర్ రెడ్డి అవినితికి, అక్రమాలకు పాల్పడితే మీ హయాంలో ఎందుకు పోలీసు బాసుగా కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ముప్పై ఆరేళ్లపాటు మహేందర్ రెడ్డి పోలీసు సర్వీసులో సేవలు అందించారని అన్నారు. మహేందర్ రెడ్డి మీ లాగా లిక్కర్ స్కాములు చేశాడా.. టీఎస్పీఎస్సీ ఎగ్సామ్స్ లీక్ చేయించాడా.. సర్కారు జాబ్ లు మీకు అనుకూలమైన వారిని ఒక గదిలో కూర్చొబెట్టి రాయించాడా.. చెప్పాలని కవితపై కొండా సురేఖ ఫైర్  అయ్యారు. సింగరేణి ప్రాంతంను వదిలేసి, వేరే చోటకు నిధులు తీసుకెళ్లి అక్కడ డెవ్ లప్ చేశారన్నారు. 

సింగరేణిలోని డెవలప్ మెంట్స్ ఫండ్స్ ను మెదక్, గజ్వేల్, సిరిసిల్లా డెవలప్ మెంట్ కు ఉపయోగించుకున్నారని ఎద్దెవా చేశారు. తెలంగాణ ప్రజలు మేము న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కొండా సురేఖ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైన కాలేదని, అప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడంమానుకొవాలని ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితకు, కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు.

Read More: Disha Patani: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన లోఫర్ బ్యూటీ, బోల్డ్ పిక్స్ వైరల్

ఇదిలా ఉండగా.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ పై అనేక అవినీతి, అక్రమాలు పాల్పడి కోట్ల రూపాయలు దోచుకున్నారని అనేక  వార్తలు వచ్చాయి. కొందరు కావాలనే తన ప్రతిష్టను దిగజార్చేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ వేచిచూడద్దని, తొందరలోనే నిరుద్యోగులుకు గుడ్ న్యూస్ ఉంటుందని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News