పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆహ్వానం కోరుతోంది.

Last Updated : Sep 7, 2018, 09:46 PM IST
పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆహ్వానం కోరుతోంది. ఆసక్తి, అర్హత గలవారు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ tspri.cgg.gov.inలో పేర్కొన్న ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగంలో మొత్తం 9, 355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను కొత్త జోనల్‌ విధానం ప్రకారం భర్తీ చేయనుంది తెలంగాణ సర్కార్. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారి వయస్సు 31-8-2018 నాటికి 18-39 మధ్య ఉండాలని పేర్కొంది. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పరీక్ష 200 మార్కులకుగాను రెండు పేపర్లలో ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్  విధానం ఉంది. రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అర్హత: డిగ్రీ. ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 800/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, బీసీ (నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులకు) రూ. 400/-
 

దరఖాస్తు చేయండిలా..

  • www.tspri.cgg.gov.in అనే వెబ్ సైట్ ను సందర్శించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
  • జూనియర్ పంచాయితీరాజ్ కార్యదర్శి అనే లింక్ మీద క్లిక్ చేయండి.
  • ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ వివరాలను నమోదు చేయండి.
  • మీరు కొత్త యూజర్ అయితే, ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవలసినవి:

  • మొబైల్, ఈమెయిల్ ఐడీ తప్పనిసరి.
  • పుట్టినతేదీ వివరాలతో పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు.
  • ఫీజు చెల్లింపు.
  • దరఖాస్తులో అన్ని వివరాలు పేర్కొని సబ్మిట్ చేయవలెను.

 

 

Trending News