Telangana Intermediate Board Changes 1 Minute Rule: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాక ఎగ్జామ్ హల్ కు నిముషం ఆలస్యమైన కూడా అనుమతించే వారు కాదు.. ఈ నిబంధలను తాజగా, సవరిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి కూడా వస్తుందని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణాలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.
Read More: Mango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..
ఈ క్రమంలోనే చాలా మంది ఎగ్జామ్స్ లకు సరైన సమయంకే స్టార్ట్ అవుతున్నారు. కానీ అనుకోని విధంగా.. ట్రాఫిక్ జాబ్ కావడం ఏదోఒక ఘటనలు జరగటంతో ఎగ్జామ్స్ కు టైమ్ కు వెళ్లలేకపోతున్నారు. దీంతో ఎగ్జామ్ సెంటర్ కు ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులను, అధికారులు లోనికి అనుమతించడంలేదు. ఈ క్రమంలో కష్టపడి చదివి ఇలా జరిగిందని కొందరు విద్యార్థులు సూసైడ్ లు కూడా చేసుకుంటున్నారు.
మరికొందరు తమ చదువును మధ్యలోనే మానేస్తున్నారు. నిముషం నిబంధన అనేది విద్యార్ధులకు పెద్ద గుదిబండగా మారిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు తల్లిదండ్రులు, అనేక మాధ్యమాలతో ఇంటర్ బోర్డుకు ఈ నిముషం నిబంధనను సవరించాలని మొరపెట్టుకున్నారు.
Read More: Snake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..
తాజాగా, ఇప్పుడు నడుస్తున్న ఇంటర్ ఎగ్జామ్ లలో కొన్ని చోట్ల.. విద్యార్థులు సమయంకు వెళ్లలేకపోవడంతో , అధికారులు లోనికి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపంతో ఒక స్టూడెంట్ చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. దీంతో దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువడ్డాయి. ఈక్రమంలోనే తాజాగా, ఇంటర్ బోర్డు నిముషం నిబంధలను సవరిస్తు కొత్తగా ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం.. ఇక నుంచి విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చిన కూడా అధికారులు ఎగ్జామ్ హల్ కు అనుమతి ఇస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook