హైదరాబాద్: ప్రపంచాన్ని కబళించి వేస్తున్న కరోనా వైరస్ దేశంలో క్రమ క్రమంగా వ్యాప్తి పెరుగుతూపోతోంది. కాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అని తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి మొత్తంలో అప్రమత్తమైందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కాగా ఇదే అంశంపై సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నివేదిక తెప్పించుకొని చర్చలు జరిపారని ఆయన అన్నారు. కరోనా వ్యాధి నివారణ కోసం సీఎం కేసీఆర్ 100 కోట్ల నిధులు సబ్ కమిటీ వేశారని ఆయన అన్నారు.
కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి, అతనితో 88 మంది కలిశారనే సమాచారం ఉందని, 88 మందిలో ఇప్పటి వరకు 45 మందిని గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా రోగికి ఆసుపత్రిలో చేరిన నాటి నుండి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు 80వేల మందికి కరోనా వైరస్ సోకితే.. 2వేలకు పైగా మాత్రమే మృతి చెందారని, వైరస్ సోకినప్పటికీ మరణాల శాతం చాలా తక్కువగా ఉందని అన్నారు. గతంలో ఎబోలా కంటే భయంకరమైన వ్యాధి కరోనా కాదని, గాలి ద్వారా కరోనా సోకే ఆస్కారం లేదని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..