ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుకు వెంటనే ఆధార్

ఆధార్ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీఎస్-సర్కార్ కొత్త విధానం అమలులోకి తెచ్చింది. 

Last Updated : Jan 8, 2018, 01:18 PM IST
ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుకు వెంటనే ఆధార్

ఆధార్ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. ఈ నేపథ్యంలోనే టీఎస్-సర్కార్ కొత్త విధానం అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్)తో పాటు ఆధార్ కార్డు అందజేయనుంది సర్కార్.

జీహెచ్ఎంసీ ఈ-గవర్నెన్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత ఓ తల్లిపిల్లల ఆసుపత్రిలో అమలుచేయగా.. విజయవంతమైంది. దాంతో మిగితా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ విధానం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ పథకాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వ్యతిరేకిస్తున్నాయి. దీనికోసం పరికరాలు, అదనపు సిబ్బందిని నియమించాల్సి వస్తుందని.. పెనుభారం అవుతుందని భావిస్తున్నాయి. అయితే అధికారులు వీరితో చర్చలు జరుపుతున్నారు.  జీహెచ్ఎంసీ పరిధిలోని 25 ఆసుపత్రుల్లో మరికొన్ని రోజుల్లోనే ఈ పథకం అమలులోకి వస్తుంది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆలోచిస్తోంది.

Trending News