తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus In Telangana) బారిన పడ్డ వారిలో చాలా వరకు ఏ కోవిడ్19 లక్షణాలు కనిపించడం లేదు. ఇలాంటి పేషెంట్లకు హోం క్వారంటైన్ సూచించి, తద్వారా ఐసోలేషన్ (Home Isolation)లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అసలు టెస్టులు చేయడం లేదంటూ తీవ్ర ఆరోపణలు, విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ బీభత్సం
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేకంగా ఓ యాప్ (Hitam App)ను రూపొందించింది. హోం ఐసోలేషన్లో ఉంటున్న బాధితుల కోసం హితం (Home Isolation Treatment And Monitoring) Hitam App అని పేరు పెట్టింది. యాప్ చివరిదశలో టెక్నికల్ సమస్యలు చెక్ చేస్తున్నట్లు సమాచారం. వీటిని సరిచేసి అతి త్వరలోనే హోం ఐసోలేషన్ పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos
యాప్ (Telangana home isolation App) అందుబాటులోకి వచ్చాక హోం ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లు కచ్చితంగా ‘హితం’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా వైద్యశాఖకు సమాచారం వెళ్తుంది. వైద్యులు ఆ ఐసోలేషన్ పేషెంట్లకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఏకకాలంలో హితం యాప్ ద్వారా 10వేల మందికి ఆన్లైన్లోనే సేవలు అందించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా 108కి కాల్ చేసి విషయం తెలిపేలా రూపొందించడం విశేషం. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..