Current Charges increase: అవును ఎంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు..200 యూనిట్స్ వాడుకునే వారికీ ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు అంటూ చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తీరా ఈ హామిలను అమలు చేయడంలో విఫలమైంది. దీంతో హైడ్రా అంటూ హైడ్రామాకు తెరలేపింది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు అప్పట్లో కాంగ్రెస్ జమానాలోనే అప్పటి ప్రభుత్వాలు చెరువులు, కుంటలు పరిధిలోని ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న స్థలాల్లోని కట్టడాలకు పర్మిషన్స్ ఇచ్చారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపెడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఎవరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నారనే విషయమై క్లారిటీ లేదు. ఏదో కొద్ది మందికి మాత్రమే ఇచ్చి మొత్తంగా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ బిల్డప్ ఇస్తోంది ప్రభుత్వం. ఈ ఫ్రీ కరెంట్ పుణ్యానా... నెల నెలా కరెంట్ బిల్లు కరెక్ట్ గా కట్టివారి వెన్ను విరిచేలా తాజాగా తెలంగాణలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
మొత్తంగా తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు కరెంట్ షాక్ తగులబోతుంది ఎందుకంటే విద్యుత్తు ఛార్జీలను సవరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలుగా పిలిచే డిస్కంలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. మొత్తం మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. వీటిని ERC ఆమోదిస్తే... లోటును పూడ్చుకోవడానికి 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఇళ్లకు వాడే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీ వసూలు చేస్తారు. అది ప్రస్తుతం రూ. 10 వసూలు చేస్తున్నారు. దాన్ని 50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల లోపు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి ఫిక్స్‌డ్ ఛార్జీ పెంపు ఉండదు.
రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్లకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారని సమాచారం.మొత్తంగా ఉచిత విద్యుత్ అని చెప్పి కరెక్ట్ గా బిల్లు కట్టేవారికీ మాత్రం భారీగా ఛార్జీలు పెంచి ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.