T-Govt Key Decision: వ్యాక్సినేషన్ తీసుకొని వారికి నో రేషన్, నో పెన్షన్ క్లారిటీ

వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో.. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 05:18 PM IST
  • నో పెన్షన్, నో రేషన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • ప్రభుత్వం ఇలాంటి వాటిపై ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పిన అధికారులు
  • ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపిన శ్రీనివాస రావు
T-Govt Key Decision: వ్యాక్సినేషన్ తీసుకొని వారికి నో రేషన్, నో పెన్షన్ క్లారిటీ

Telangana Government Taken Sensational Decision Over Vaccination: కరోనా (Corona) భారీ నుండి కాపాడుకోటానికి మనకు ఉన్న ఒకే ఒక అస్త్రం వ్యాక్సిన్.. చాలా మంది వ్యాక్సిన్ ను తీసుకోకుండా అజాగ్రత్తగా ఉంటున్నారు. వీరి వల్ల వారికే కాదు ఇతరులకు కూడా ప్రమాదమే.. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారికి కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

తెలంగాణలో (Telangana) వ్యాక్సిన్ తీసుకొని వారికి రేషన్ (Ration) మరియు పెన్షన్ (Pension) నిలిపివేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ (Telangana State Health Department) సంచలన ప్రకటన చేసిందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు (Health Director Srinivasa Rao) స్పంచించారు. 
Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. అన్ని రాష్ట్రాలకు కాదండోయ్!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండో డోస్ (Second Dose) తీసుకొని వారి సంఖ్య దాదాపు 35 లక్షలు.. గడువు ముగిసిన కూడా వారు రెండో డోసు తీసుకోవటం లేదని.. ఈ విషయంపై ఎన్ని సార్లు ప్రజల్లో అవగాహన కల్పించామని తెలిపారు.. 

"మొదటి డోసు తీసుకొని, గడువు ముగిసినప్పటికీ రెండో డోసు తీసుకొని వారు ఈ నెల ముగిసేలోగా వ్యాక్సిన్ తీసుకోకుంటే .. నవంబర్ 1 వ తేదీ నుండి వారి పెన్షన్ మరియు రేషన్ రెండు అందవని" పుకార్లు నమ్మవద్దని.. రాష్ట్ర ప్రభుతం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని.. ప్రజలు సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలని నమ్మవద్దని... ఇలాంటి విషయాలలో ఆందోళనకు గురికావద్దని శ్రీనివాసరావు తెలిపారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పక తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు 

Also Read: Aryan Khan Case: ఈ రోజే నాలుగో సారి ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ.. బెయిల్ వస్తుందా..? రాదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News