Telangana : ఇకపై పదవ తరగతి పరీక్షలు 12 ఏళ్లకే రాయవచ్చు

Telangana : మీలో ప్రతిభ, సామర్ధ్యముంటే ఇక వయస్సు అడ్జంకి కానేకాదు. 12 ఏళ్లకే ఆ పరీక్షలు రాయొచ్చు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 15, 2022, 11:28 AM IST
 Telangana : ఇకపై పదవ తరగతి పరీక్షలు 12 ఏళ్లకే రాయవచ్చు

Telangana : మీలో ప్రతిభ, సామర్ధ్యముంటే ఇక వయస్సు అడ్జంకి కానేకాదు. 12 ఏళ్లకే ఆ పరీక్షలు రాయొచ్చు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అందించింది. మీలో ప్రతిభ, సామర్ధ్యముంటే వయస్సు అడ్డంకి కాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పదవ తరగతి పరీక్షలు రాసే వయసు పరిమితిలో వెసులుబాటు కల్పించింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ. ఇప్పటి వరకూ పదవ తరగతి పరీక్షలు రాయాలన్నా లేదా చదవాలన్నా 14 ఏళ్ల వయస్సుండాలి. అయితే తాజాగా ప్రభుత్వం రెండేళ్ల వెసులుబాటు (Age Relaxation) కల్పించింది. అంటే ఇక నుంచి 12 ఏళ్ల వయసున్నా సరే..12వ తరగతి పరీక్షలు రాయవచ్చు.

తాజా నిబంధనల ప్రకారం వయసు మినహాయింపు కోరే విద్యార్ధులు 3 వందల చలానా కట్టి..మెడికల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటే..ఆ స్కూల్ హెడ్ మాస్టర్ , ప్రైవేట్ స్కూల్స్ అయితే డీఈఓకు వయసు మినహాయింపు ఇచ్చే అధికారం ఉంటుంది. 2022 పదవ తరగతి పరీక్షల షెడ్యుల్ ఇప్పటికే విడుదలైంది. దీని ప్రకారం మార్చ్ 3 వరకూ ఫీజు చెల్లించవచ్చు. ఎస్టీ, ఎస్టీ బీసీ, రూరల్ విద్యార్ధుల వార్షిక ఆదాయం 24 వేలలోపుంటే..పరీక్ష ఫీజులో రాయితీ ఉంటుంది. దీనికోసం ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. 

ఇవి కాకుండా ఇంకొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది తెలంగాణ (Telangana) విద్యాశాఖ.డిస్ లెక్సియా సమస్యతో బాధపడేవారికి థర్డ్ లాంగ్వేజ్ నుంచి మినహాయింపు ఉంది. మరొకరిని అసిస్టెంట్ గా నియమించుకోవచ్చు. ప్రతి పరీక్ష పేపర్‌కు గంట సమయం అదనంగా ఉంటుంది. మూగ, చెవుడు, బ్లైండ్ విద్యార్దులు కూడా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి విద్యార్ధులకు పాస్ మార్కుల్ని 35 నుంచి 20కు తగ్గించారు. ప్రతి పేపర్కు అరగంట సమయం అదనంగా ఇచ్చారు. అయితే ఈ వెసులుబాటు కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. 

Also read: Telangana Holidays: తెలంగాణలో స్కూల్స్ సెలవులు పొడిగింపు, ఎప్పటివరకంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News