TS Govt: జింజానా మైదానం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ టికెట్ల విక్రయాలపై వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏను ఆదేశించారు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి. మొత్తం వివరాలతో తన వద్దకు రావాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌తోపాటు ఇతర అధికారులను ఆదేశించారు. దీంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు హెచ్‌సీఏ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే
సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది.
ఈనెల 25న ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రేపు నాగ్‌పూర్ వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే..హైదరాబాద్ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే మూడు టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈనెల 25న మ్యాచ్ సందర్భంగా టికెట్ల విక్రయాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేపట్టింది. ఇందులోభాగంగా సికింద్రాబాద్ జింఖాన్ గ్రౌండ్‌లో టికెట్ల విక్రయాలు చేపట్టింది.
ఈసందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. అభిమానుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. ఓ మహిళ చనిపోయినట్లు ప్రచారం జరిగింది. సుమారు 20 మంది అభిమానులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అంచనాలు మించి అభిమానులు రావడంతోనే ఉద్రిక్తత నెలకొందని పోలీసులు తెలిపారు.
ఈఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతిక లోపంతోనే టికెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. నగదు తీసుకుని టికెట్లను అమ్ముతున్నారు. దీంతో విక్రయాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఈక్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. హెచ్‌సీఏ తీరు వల్లే ఇలా జరిగిందని అభిమానులు మండిపడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే ఉద్రిక్తత నెలకొందని పోలీసులు సైతం చెబుతున్నారు.
తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ తెలిపారు. ఓ మహిళ చనిపోయిందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. టికెట్ల కోసం జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఓ మహిల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. ఈవ్యవహారంలో హెచ్‌సీఏ నిర్వహణ లోపం ఉంటే కఠిన చర్యలు తప్పవన్నారు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ.
Also read:T20 World Cup: జాతీయ జట్టులో చోటు దక్కాలంటే మాములు విషయం కాదు..యువ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Also read:IND vs AUS: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో పోలీసుల లాఠీఛార్జ్..ఓ మహిళ మృతి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
TS Govt: జింఖానా గ్రౌండ్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్..నివేదిక ఇవ్వాలని ఆదేశం..!
జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత
క్రికెట్ టికెట్ల విక్రయంలో గందరగోళం
ఘటనపై ప్రభుత్వం సీరియస్