/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

తెలంగాణలో కొలువుల జాతర నడుస్తోంది. మొన్నటికి మొన్న ఐదు నోటిఫికేషన్లు జారీ చేసిన తెలంగాణ సర్కార్ మరో నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేసింది. తాజాగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. 

వివరాల్లోకి వెళ్లినట్లయితే... మార్కెటింగ్‌ శాఖలో 200 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫైల్ కు కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. కాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన తర్వలో నోటిఫికేషన్  వెలువడనుంది. కాగా ఈ నియామకాల ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఈ నెల 2న  రెండు వేల 786 పోస్టుల భర్తీ కోసం ఐదు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన విషయం  తెలిసిందే.అలాగే తెలంగాణ పోలీస్‌ నియామక సంస్థ ఇటీవలే 18 వేల 428 పోలీసు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

తాజా ప్రకటనతో నిరుద్యోగులకూ మరింత ఊరట నిచ్చినట్లయింది.  

మార్కెటింగ్ శాఖలో ఉద్యోగాల భర్తీ వివరాలు:

కార్యదర్శి పోస్టులు     11
అసిస్టెంట్‌ కార్యదర్శి పోస్టులు 27
అసిస్టెంట్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు 80
గ్రేడర్ పోస్టులు 13
బిడ్‌ క్లర్క్ పోస్టులు 09
జూనియర్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు 60 
మొత్తం పోస్టులు: 200

ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి  వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్ చూడవచ్చు. ఇదిలా ఉండగా తాజా తీపి కబురుతో తెలంగాణ నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తోంది. 

 
Section: 
English Title: 
Telangana government given the green signal to Jobs appointments
News Source: 
Home Title: 

మరిన్ని ఉద్యోగాల భర్తీకి టి.సర్కార్ ఆమోదం

హ్యాపీ న్యూస్:  మరిన్ని ఉద్యోగాల భర్తీకి టి.సర్కార్ ఆమోదం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మరిన్ని ఉద్యోగాల భర్తీకి టి.సర్కార్ ఆమోదం