Telangana New land values: భూములకు కొత్త మార్కెట్ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana New Registration Charges:: తెలంగాణలో పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణలకు సంబంధించి.. శుక్రవారం, శనివారం ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలంటూ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 12:48 PM IST
  • తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలు
  • ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..
Telangana New land values: భూములకు కొత్త మార్కెట్ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Land Values : తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఖరారు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను యాభై శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ విలువను 25 నుంచి 30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్‌ల (Registrations) శాఖ నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుత మార్కెట్ విలువకు అలాగే సవరించిన విలువకు మధ్య వ్యత్యాసం 35 నుంచి 40 శాతం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వాణిజ్య సముదాయాల్లో కూడా అన్ని ఫ్లోర్‌లకు ఒకే మార్కెట్‌ విలువను అధికారులు నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగినట్లు తెలిపారు. 

ఇక తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం, అపార్ట్‌మెంట్స్‌లలో (Apartments‌) చదరపు అడుగుకు 25 నుంచి 30 శాతం దాకా విలువను పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ కూడా 50 శాతం పెరిగింది.

Also Read: NeoCov: కరోనా కొత్త వేరియంట్​.. సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!

సుదీర్ఘ సమీక్ష తర్వాత స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ప్రతిపాదనలను తాజాగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపింది. అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు, రేపు ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ (Telangana) రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read: Kousalya Covid 19: కరోనా బారిన పడిన కౌసల్య.. తీవ్ర జ్వ‌రం, గొంతు నొప్పితో బాధపడుతున్న సింగర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News