Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు తగ్గట్టే ఉన్నా కొన్ని నియోజకవర్గాలు లేదా కొందరి ఫలితాలు మాత్రం ఊహించనివిగా మారాయి. ఉద్ధండులు ఓటమి పాలైతే, సామాన్యులు విజయం సాధించారు. కొందరైతే యధావిధిగా భారీ మెజార్టీ నమోదు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ పరిణామాలిలా ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల ముగిశాయి. 119 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో అధికారం చేపట్టనుంది. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 8 స్థానాలు కైవసం చేసుకుంటే మజ్లిస్ తన 7 స్థానాల్ని పదిలం చేసుకుంది. కాంగ్రెస్ పొత్తుతో సీపీఐ ఒక స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ ఓటరు మార్పు కోరుకోవడంతో పదేళ్ల ఉద్యమపార్టీ పాలనకు బ్రేక్ పడింది. తెలంగాణ ఎన్నికల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాల్లో కొన్ని మీ కోసం,..
తెలంగాణ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి వివేకానంద్ రాష్ట్రంలోనే అత్యదిక మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధిపై 85 వేల మెజార్టీతో గెలిచారు. తరువాత సిద్ధిపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి హరీష్ రావు 82 వేల ఓట్లతో విజయం సాధించారు. ఇక మూడో స్థానంలో చాంద్రాయణ గుట్ట నుంచి ఎంఐఎం అభ్యర్ధి అక్బరుద్దీన్ ఒవైసీ 81 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కూకట్‌పల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు 70 వేల ఓట్ల మెజార్టీ సాధించారు.ఇక ఐదవ స్థానంలో ఎస్సీ రిజర్వ్డ్ నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం 68 వేల ఓట్లతో గెలిచారు.
ఇక బీజేపీ హేమాహేమీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు ఓటమి పాలయ్యారు. జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ హేమాహేమీలు ఓడినా...8 స్థానాల్లో విజయం సాధించింది.
ఇక అన్నింటికంటే ముఖ్య పరిణామం కామారెడ్డి నియోజకవవర్గం. ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంత్ రెడ్డి ఇద్దరినీ బీజేపీకు చెందిన ఓ సాధారణ వ్యక్తి వెంకట రమణారెడ్డి ఓడించడం గమనార్హం.
Also read: AP vs Telangana: తెలంగాణ కొత్త ప్రభుత్వంతో ఏపీ సయోధ్య కొనసాగునుందా, బ్రేక్ పడుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook