IT Raids: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ఇళ్లు, ఆస్థులపై ఐటీ దాడులు

IT Raids: తెలంగాణలో ఓ వైపు ఎన్నికలు, మరోవైపు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ఆస్థులపై ఇన్‌కంటాక్స్ దాడులు ప్రారంభమయ్యాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2023, 09:43 AM IST
IT Raids: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ఇళ్లు, ఆస్థులపై ఐటీ దాడులు

IT Raids: తెలంగాణలో చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి ఇంట్లో, ఆఫీసులపై ఇన్‌కంటాక్స్ శాఖలు సోదాలు నిర్వహిస్తోంది. వివేక్ ఇళ్లు, ఆస్థులపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ జరుగుతున్న దాడులు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

మొన్నటి వరకూ బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇటీవలే తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అంతేకాదు చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీలో ఉన్నంతవరకూ జరగని ఐటీ దాడులు ఇప్పుడు ఎన్నికల వేళ హఠాత్తుగా ప్రారంభమయ్యాయి. చెన్నూరు, హైదరాబాద్, సోమాజిగూడలోని ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా వివేక్‌కు సంబంధించిన పార్టీ కార్యాలయాలు, బంధవుల ఇళ్లు, కార్యాలయాల్లో సైతం సోదాలు జరుగుతున్నాయి. 

ఐటీ సోదాల సంగతి తెలియగానే పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వివేక్ ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు. వివేక్ భారీగా డబ్బులు పంచుతున్నారంటూ చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమీషన్ నుంచి ఐటీ అధికారులకు సమాచారం చేరింది. ఇవాళ ఉదయమే ఐటీ ఏకకాలంలో వివేక్ ఇళ్లు, ఆఫీసులు, పార్టీ కార్యాలయాలపై, బంధుమిత్రుల ఇళ్లపై దాడులు ప్రారంభించింది. కేవలం రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెలరోజులకే దాడులు చేయడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 10వ తేదీన పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహించింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దిరోజులకే వివేక్ ఇళ్లపై ఐటీ దాడులు చేయడం విశేషం.

Also read; Revanth Reddy: కేసీఆర్‌ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి.. రేవంత్ రెడ్డి పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News