Telangana Elections 2023: భూపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి: నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో అదరగొడుతున్నారు. ఈ రోజు జరిగిన నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2023, 07:08 PM IST
Telangana Elections 2023: భూపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి: నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్

Telangana Assembly Elections 2023: ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో అదరగొడుతున్నారు. ఈ రోజు జరిగిన నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్  పరిపాలనలో ఉన్న నారాయణఖేడ్ కు బీఆర్ఎస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్ కు ఢిల్లీకీ ఆస్మాన్ కు ఉన్నంత ఫరక్ ఉన్నది. చాలా మార్పులు తెచ్చినం.. దీనికి ముఖ్య కారకుడు నారాయణఖేడ్ హీరో భూపాల్ రెడ్డి. ఉప ఎన్నికల్లో మీరు ఆశీర్వాదం ఇచ్చిన దగ్గర నుంచి నేటి వరకు తన భూపాల్ రెడ్డి పని ఒక్కడి కూడా నన్ను ఎప్పుడూ అడుగలేదు. కొత్త మండలాలు, పాఠశాలలు, ప్రాజెక్టులు, నియోజకవర్గం కోసం పనులు అడిగేవారు. అందుకే నారాయణఖేడ్ ఇంత మంచి అభివృద్ధి జరిగింది. భవిష్యత్తులో ఇంకా జరుగాలి.

నారాయణఖేడ్ కు నేను మంత్రిగా ఉండే రోజుల్లో చాలా సార్లు వచ్చినాం. ఒకప్పుడు ఇక్కడ  రేకు డబ్బాలు కనపడేవి. ఇప్పుడు భవంతులు కనపడుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఒకప్పుడు రావడానికి భయపడేది. ఇప్పుడు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు.

ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చిమ్నిబాయి అనే లంబాడీ మహిళ హరీశ్ రావును అడిగిందంట.. త్రాగడానికి నీళ్లు లేవు.. ఎందుకు ఓటు వెయ్యాలే అని అడిగిందట. మంచంలో కూర్చుని స్నానం చేసి కింద తాంబూలం పెట్టుకుని నీళ్లు పట్టి పశువులకు పెట్టుకుంటాం.. అందట. కానీ ఇపుడు ఆలా లేదు. బసమేశ్వర , సంగమేశ్వరలో లిఫ్టులు పెట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సింగూరుకు లింకు పెట్టుకున్నాం. జహీరాబాద్ కు నారాయణఖేడ్ కు లిఫ్టు పెట్టుకున్నాం. సింగూరు సంవత్సరం పొడవునా నిండి ఉండే ఉంటది. శాశ్వతమైన జలవనరుగా తయారైంది. 

మల్లన్న సాగర్ నుంచి వస్తున్న కాలువ నర్సాపూర్ వరకు తవ్వకం అయింది. దీని ద్వారా 40 వేల ఎకరాల వరకు నీళ్లు రాబోతున్నాయి. బసవేశ్వర కంప్లీట్ అయ్యి. మల్లన్న సాగర్ వచ్చేస్తే సుమారు లక్షా 80 వేల  ఎకరాలకు  సాగునీరు వస్తుంది. భూపాలరెడ్డిని గెలిపించండి నల్లవాగు లిఫ్టు ఇరిగేషన్ పెట్టిస్తాను.. రెండు పంటలు పండేట్లు నీళ్లు అందించే బాధ్యత నాది. మాసాన్ పల్లి రోడ్డు కూడా మంజూరు చేయిస్తా.. ప్రజల కోసం ఆయన కోరిన కోరికలు తీర్చుతాను

Also Read: CM KCR: చేతగాని దద్దమ్మలు కత్తి పోట్లకు ఒడిగట్టారు.. నాపై దాడిగానే భావిస్తా..: సీఎం కేసీఆర్  

భూపాల రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నారాయణ ఖేఢ్ దశ, దిశ మారిపోయింది. నారాయణఖేడ్ లో ఎక్కువగా సమయం ఉండి మీ సేవలోనే ఉంటున్నాడు. నారాయణ ఖేడ్ ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఓట్లు వేసే సమయంలో ఆగం కావద్దు.. గత పాలకుల పాలనలో ఎట్లా ఉండే. ఇప్పుడు ఎట్ల ఉండేదో ఆలోచించండి..  కర్ణాటక మీ పొరుగున్నే ఉంటది. కర్ణాటక రైతుల గతి ఏమవుతున్నదో మీకు తెలుసే ఉంటది. నేను చెప్పాల్సిన అవసరం లేదు.  మాసిఫాయితనానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి 5 గంటలు కరెంటు ఇస్తామని చెబుతున్నాడు. సిగ్గుండాలే చెప్పడానికి.. 24 గంటలు ఇచ్చే రాష్ట్రం వచ్చి అలా మాట్లాడితే దేనితోటి నవ్వాలే. కాంగ్రెస్ పార్టీ  దద్దమ్మలు గెలువడం చేతకాక ప్రభాకర్ రెడ్డి మీద కత్తుల పట్టి దాడులు చేసిండ్లు. ప్రచారం చేస్తుంటే పొడిచిండ్లు. 

మూడు ఇంచుల లోతుకు కత్తి దిగింది. దేవుని దయవల్ల ప్రాణాపాయం లేకుండా పోయింది. హరీశ్ రావు దగ్గరుండి చూసుకుంటున్నాడు.యశోద హస్పటల్ లో చేర్చారు. కార్తకర్తలు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
భూపాల్ రెడ్డి గారు నారాయణఖేడ్ చరిత్రలోనే మంచి నాయకుడు.. మీ కోసం పరితపిస్తాడు.. 100 తండాలను కొత్త గ్రామ పంచాయతీలను చేసుకున్నాం. లంబాడీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసుకుంటున్నాం. పోడు భూముల సమస్యలు పరిష్కరించుకున్నాం. భూపాల్ రెడ్డిని ఆశీర్వదించండి. భారీ మెజారిటీతో గెలిపించండని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 

Also Read: Anasuya : ఎక్స్‌పోజింగ్ చేయడం ఈజీ కాదు.. నెటిజన్‌కు అనసూయ దిమ్మతిరిగే కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News