CS Somesh Kumar: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేష్‌కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానలు, వరదల పరిస్థితులపై ఆరా తీశారు.
ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రాణ నష్టం కల్గకుండా కూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. విపత్తుల శాఖ నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సమావేశం నిర్వహించినట్లు సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదని స్పష్టం చేశారు. వరుసగా రెండురోజుల సెలవులు వస్తున్నాయని..అయినా అధికారులంతా క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని..వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండిపోయాయని..వాటికి గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎక్కడైతే రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతినాయో..వాటిపై నిఘా ఉంచాలని అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. ఆయా మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాలు, ప్రయాణికులు అటువైపు వెళ్లకుండా చూడాలన్నారు. పోలీసులు, నీటి పారుదల, రోడ్లు, భవనాలు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే అధిక వర్షపాతం నమోదు అయ్యే జిల్లాల పేర్లను వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలను వీడని వానలు..మరోమారు రెయిన్ అలర్ట్ జారీ..!
Also read:Shiv Sena: శివసేన ఎవరిది..? ఉద్దవ్ ఠాక్రేదా..షిండేదా..పరిస్థితులు ఏం చెబుతున్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.