Telangana COVID-19 cases: హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,012 కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 4,85,644 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టివ్ కేసులున్నాయి.
Also read : Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు
నేడు నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో అత్యధికంగా 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం జిల్లాలో 247, మేడ్చల్ జిల్లాలో 225, కరీంనగర్ జిల్లాలో 188, నాగర్ కర్నూలులో 146, భద్రాద్రి కొత్తగూడెంలో 142 కేసులు, నల్గొండలో 139 కేసులు, మహబూబ్‌నగర్‌లో 129 కేసులు నమోదు అయ్యాయి. మిగతా జిల్లాల్లో వందలోపు కేసులు (COVID-19 cases) నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook