తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అయితే గత నెలతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం (నవంబర్ 29న) రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో 593 శాంపిల్స్ కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,69,816కి చేరుకుంది.
తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus Cases In Telangana) బారిన పడి ఆదివారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,458కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో నిన్న రాత్రి వరకు చికిత్స అనంతరం 1,058 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివకూ మొత్తం 2 లక్షల 58 వేల 336 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Also Read : Lower Interest Rates On Home Loans: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. అతి తక్కువ వడ్డీకే రుణాలు
కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కన్నా తెలంగాణలో అధికం. జాతీయ సగటు 93.8 శాతం ఉండగా, తెలంగాణలో 95.74 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకోవడం గమనార్హం. తాజాగా 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 119 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. తెలంగాణలో ప్రస్తుతం 10,022 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇందులో 7,946 మంది వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
Anchor Varshini Photos: యాంకర్ వర్షిణి ఫొటోషూట్.. షార్ట్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా!
Also Read : Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ Monal Gajjar ప్రతి వారం ఎలా సేవ్ అవుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe