KCR TARGET BJP: మోడీ సర్కార్ పై కేసీఆర్ యుద్ధం! సాయంత్రం కీలక ప్రకటన..

KCR TARGET BJP: అగ్నిపథ్ మంటలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రాజకీయాలపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అగ్నిపథ్ అంశాన్ని తనను అస్త్రంగా మార్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Jun 18, 2022, 02:37 PM IST
  • సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
  • బీజేపీ టార్గెట్ గా గులాబీ బాస్ దూకుడు
  • అగ్నిపథ్ పై మాట్లాడే అవకాశం
KCR TARGET BJP: మోడీ సర్కార్ పై కేసీఆర్ యుద్ధం! సాయంత్రం కీలక ప్రకటన..

KCR TARGET BJP: అగ్నిపథ్ మంటలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసనలకు అదుపుతప్పి హింసాత్మకంగా మారాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస ఘటనలు, రైల్వే పోలీసుల కాల్పుల్లో యువకుడు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కేంద్ర సర్కార్ విధానాలపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కొన్ని రోజులుగా రాజకీయాలపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అగ్నిపథ్ అంశాన్ని తనను అస్త్రంగా మార్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణలో కొన్ని రోజులుగా ఏదో ఒక సమస్యపై విపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. కాని ఏనాడు కేసీఆర్ స్పందించలేదు. కాని ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడబోతున్నారు కేసీఆర్. దీంతో తెలంగాణ సీఎం ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

అగ్నిపథ్ విషయంలోనే కేంద్ర సర్కార్ ను కేసీఆర్ టార్గెట్ చేస్తారని భావిస్తున్నారు. అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగుల్లో వస్తున్న వ్యతిరేకతను వివరిస్తూ.. అగ్నిపథ్ స్కీమ్ ను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తారని తెలుస్తోంది. అగ్నిపథ్ పథకానికి సంబంధించి నిపుణుల నుంచి కేసీఆర్ సమాచారం తీసుకున్నారని అంటున్నారు. బీజేపీతో దేశానికి నష్టమని కొన్ని రోజులుగా వాదిస్తున్న కేసీఆర్.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో తన వాయిస్ మరింతగా పెంచనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో మీడియా సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడుతారు అన్నది ఆసక్తిగా మారింది.

బీజేపీ టార్గెట్ గానే జాతీయ రాజకీయ అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇందుకోసం  ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించారు. చైనా బార్డర్ లో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సాయం చేశారు. ప్రస్తుతం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో అగ్నిపథ్ ను అస్త్రంగా వాడుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే పోలీసుల ఫైరింగ్ ఘటనను తమకు అనుకూలంగా మలుచుకుంది టీఆర్ఎస్. నర్సంపేట బంద్ నిర్వహించింది. రాకేష్ డెడ్ బాడీతో వరంగల్ లో భారీ ర్యాలీ తీసింది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ,  ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ తో పాటు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా రాకేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంత్రులు స్వయంగా పాడే  మోశారు. రాకేష్ మృతిపై విచారం వ్యకం చేసిన కేసీఆర్.. 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మోడీ దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యాడని కేసీఆర్ ఆరోపించారు. దీంతో అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుని బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.  

Read also: Rajnath Singh Review on Agnipath: దేశంలో చల్లారని అగ్నిపథ్‌ మంటలు..రాజ్‌నాథ్‌సింగ్ కీలక రివ్యూ..!

Read also: Agnipath Riots: అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News