Vasalamarri Village: నేడు దత్తతగ్రామం వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం KCR

Telangana CM KCR In Vasalamarri villagage: నేడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గత ఏడాది ఇచ్చిన మాట ప్రకారం తన దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామానికి నేటి మధ్యాహ్నం వేళ రోడ్డుమార్గంలో చేరుకోనున్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 22, 2021, 09:15 AM IST
Vasalamarri Village: నేడు దత్తతగ్రామం వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం KCR

Telangana CM KCR Vasalamarri Tour: గత రెండు రోజులుగా జిల్లాలలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. గత ఏడాది ఇచ్చిన మాట ప్రకారం తన దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామానికి నేటి మధ్యాహ్నం వేళ రోడ్డుమార్గంలో చేరుకోనున్నారు. 

దత్తత గ్రామం వాసాలమర్రిలో సామూహిక భోజన కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సామూహిక భోజన కార్యక్రమంలో దాదాపు 3 వేల వరకు ప్రజలు సహపంక్తి భోజనం చేస్తారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఇటీవల వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌ ఆంజనేయులకు ఫోన్ చేశారు. ఈ సంభాషణ సైతం వైరల్ కావడం తెలిసిందే. గ్రామస్తులతో పాటు తన వెంట దాదాపు 200 మంది వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో నిర్వహించే సభలో గ్రామానికి సంబంధించిన అంశాలు చర్చించనున్నారు.

Also Read: TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు

మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులతో కలిసి సోమవారం వాసాలమర్రిని సందర్శించి సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ నేటి కార్యక్రమంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వ విప్ , డీసీసీబీ చైర్మన్‌, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సహపంక్తి భోజనాలు ఓ చోట, బహిరంగ కార్యక్రమం మరోచోట ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆధికారులకు సూచించారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇతర గ్రామాల ప్రజలను ఈ కార్యక్రమానికి అనుమతించరని, ఆ మేరకు చర్యలు తీసుకున్నారని సమాచారం. 

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News