Telangana floods: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

Rains and floods in Telangana: హైద‌రాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. అందులో 11 మంది హైదరాబాద్ పరిధిలోని వారేనని అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వివరించారు. భారీ వర్షాలు, వరదపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Last Updated : Oct 16, 2020, 02:52 AM IST
Telangana floods: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

Rains and floods in Telangana: హైద‌రాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ( Heavy rains ) కారణంగా పోటెత్తిన వరదల వల్ల ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. అందులో 11 మంది హైదరాబాద్ పరిధిలోని వారేనని అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వివరించారు. భారీ వర్షాలు, వరదపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరదలు ( Telangana floods ) తగ్గుముఖం పడితే కానీ పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయలేమని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాలు విన్న ముఖ్యమంత్రి.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Also read : LRS applications last date: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు

Flood relief activities యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు :
ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని అందించాలని తెలిపారు. ప్రతీ ఇంటికి మూడు రగ్గులను అందించాలని సూచించారు. హైదరాబాద్‌లో వరద ప్రభావం తీవ్రంగా ఉన్నందున జీహెచ్ఎంసిలో ( GHMC ) పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గ్రేటర్‌లో సహాయ కార్యక్రమాలం కోసం జీహెచ్ఎంసీకి తక్షణమే రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

Ex-gratia to kin of dead  మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా:
భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇళ్లు కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న నివాసాల మరమ్మత్తులకు ప్రభుత్వం తరపున అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. Also read : 
Uppal MLA Bethi Subhas Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

వాళ్లకు ప్రభుత్వ స్థలంలో కొత్త ఇళ్లు:
నగరంలో అనేక చోట్ల నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, అలాంటి వాటి స్థానంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామ‌ని స్పష్టంచేశారు.

అపార్టుమెంట్ల నిర్మాణానికి ఇకపై ఆ నిబంధన పెట్టాలి:
ఇక నుంచి అపార్టుమెంట్ భవనాల నిర్మాణాలకు అనుమతి మంజూరు చేసే సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. వరద నీరు సెల్లార్లలో నిలవకుండా ఏర్పాట్లు చేయాలనే నిబంధన తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు. లేదంటే భవిష్యుత్తులో ఇలాంటి ఉపద్రవాలు ముంచుకొచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. Also read : 
Kishan Reddy: అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News