CLP Meet Ends: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్టేచరీ సమావేశం ముగిసింది. గంటసేపు సాగిన సమావేశం తీవ్ర ఉత్కంఠ రేపింది. కాంగ్రెస్ సాంప్రదాయానికి తగ్గట్టే సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానమైంది. సీఎల్పీ నిర్ణయంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ 64 స్థానాలతో అధికారం హస్తగతం చేసుకుంది. నిన్న ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కాస్సేపటి క్రితం సీఎల్పీ సమావేశం ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో ముగిసింది. సీఎల్పీ భేటీ దాదాపు గంటసేపు సాగింది. సమావేశానికి ముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరితో ఏం సమావేశం జరిగింది, ఏం చర్చించారనేది ఇంకా తెలియలేదు. ఆ తరువాత గంట సేపు సాగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ లో కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం ఏకవాక్య తీర్మానం చేశారు. సీఎల్పీ నేతను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తీర్మానాన్ని అధిష్టానానికి పంపించారు.
సీఎల్పీ సమావేశంలో నాయకుడి ఎంపిక బాధ్యతను గెలిచిన ఎమ్మెల్యేలంతా ఖర్గేకు అప్పగించినట్టుగా డీకే శివకుమార్ సమావేశం అనంతరం మీడీయాకు తెలిపారు. తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా భట్టి విక్రమార్గ బలపరిచారు. మరో రెండు గంటల్లో ఢిల్లీ అధిష్టానం సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటుందనేది స్పష్టత రావచ్చని తెలుస్తోంది. ఈ పేరు ఢిల్లీ నుంచి ప్రకటిస్తారా లేక సీల్డ్ కవర్‌లో వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక భారమంతా ఢిల్లీకు షిఫ్ట్ అయింది. ఢిల్లీ అధిష్టానం ఎవరి పేరు సూచిస్తే వారే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అవుతారు. మరోవైపు తెలంగాణ రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని కూడా సేకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్శింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేసులో ఉన్నారు.
Also read: CLP Meet: మరి కాస్సేపట్లో సీఎల్పీ సమావేశం, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook