Jayajayahe Telangana: రాష్ట్ర గీతంపై వివాదం.. కీరవాణి ఎందుకు..? మనోళ్లు లేరా..?

Jayajayahe Telangana Song Issue: జయ జయాహే తెలంగాణ పాటను రాష్ట్రం గీతంగా ప్రకటించడంపై తెలంగాణ మ్యూజిక్ అసోషియేషన్ హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ పాటకు సంగీతం అందించాలని ఎంఎం కీరవాణిని కోరటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.    

Written by - Ashok Krindinti | Last Updated : May 25, 2024, 07:22 PM IST
Jayajayahe Telangana: రాష్ట్ర గీతంపై వివాదం.. కీరవాణి ఎందుకు..? మనోళ్లు లేరా..?

Jayajayahe Telangana Song Issue: జయ జయాహే తెలంగాణ పాటకి సంగీత దర్శకులు కీరవాణి సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదని.. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదని తెలిపింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ వేడుకల్లో జయజయాహే తెలంగాణ పాటను అధికార రాష్ట్ర గీతంగా ప్రకటించి రిలీజ్ చేయనుంది. ఈ పాటకు మ్యూజిక్ అందించాలని ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణిని కోరింది. ఈ విషయంపై తెలంగాణ మ్యూజిక్ అసోషియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఏపీకి చెందిన సంగీత దర్శకుడితో తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం చేయించడం ఏంటని ప్రశ్నిస్తోంది. లేఖలో ఏముందంటే..?

Aslo Read: Google maps: కొంప ముంచిన గూగుల్ తల్లి.. హైదరాబాద్ టూరిస్టులకు ఊహించని షాక్..

అందెశ్రీ గారు రచించిన 'జయజయహే తెలంగాణ..' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి రిలీజ్ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు. 10 ఏళ్ల క్రితమే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేదని.. అలా జరగకపోవడం దురదృష్టకరమని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసిందన్నారు. 

రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైందని.. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయన్నారు. ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయిందని.. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణికి మ్యూజిక్ అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని అన్నారు. ఎంతో ఖ్యాతి ఉన్న మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్లు పాడటమేంటి..? లేఖలో ప్రశ్నించారు. ఆ పాటకి వాళ్లు సంగీతాన్ని అందించడమేంటి..? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. 

ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారని.. మన కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇవ్వాలని లేఖలో కోరారు. ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేయించాలన్నారు. ఇది తమ సలహా మాత్రమేనని.. ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చేయకూడదని కోరుకుంటున్నామని లేఖలో రాసుకోచ్చారు.

Also Read: Realme Narzo N55 Price Cut: చెప్పుల ధరకే 64MP AI కెమెరా  Realme Narzo N55 పొందండి.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News