Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తాం: కిషన్ రెడ్డి ధీమా

Kishan Reddy Comments On BRS Govt: దేశంలో కుటుంబ పార్టీలు, అవినీతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే డీఎన్‌ఏతో ఉన్న పార్టీలు అని అన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 5, 2023, 06:54 PM IST
Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ.. రాష్ట్రంలో  కాషాయ జెండా ఎగురవేస్తాం: కిషన్ రెడ్డి ధీమా

Kishan Reddy Comments On BRS Govt: రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తిగా గోబెల్స్​ ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్​ పార్టీకి గడ్డుకాలం ఉందని అనేక సర్వేల్లో వాళ్లకు తెలిసిందని.. అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణకు ఏ రకంగా నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని చెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. 

మిగులు బడ్జెట్‌​గా ఉన్న రాష్ట్రం.. ఈరోజు అప్పుల తెలంగాణగా మారిందని అన్నారు. 1200 మంది అమరవీరులు బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా మారిందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అవినీతి తెలంగాణలో జరిగిందని ఆరోపించారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ.. కేసీఆర్​ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై.. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లుతోందన్నారు. కేసీఆర్​ ప్రభుత్వం.. కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే.. తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమన దిశలో వెళ్తుందన్నారు.

"నేను.. నా కుటుంబం.. అనే విధంగా కేసీఆర్​ వ్యవహరిస్తున్నాడు. ఇది నిజాం రాజ్యం కాదు.. అంబేద్కర్​ రాజ్యం. అందుకే బీజేపీ దేశంలో  కుటుంబ పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. దేశంలో కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజులు ఎంతో దూరంలో లేవు. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు.. అవినీతితో దేశాన్ని దోపిడీ చేస్తున్నాయి. కుటుంబ పార్టీలు ఎక్కడ ఉన్నాయో.. అక్కడ అవినీతి ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్​, ఎంఐఎం, బీఆర్​ఎస్​ ఈ మూడు పార్టీలు కూడా ఒకే రకమైన డీఎన్​ఏతో ఉన్న పార్టీలు.. కుటుంబ, అవినీతి పార్టీలు. ఈ మూడు పార్టీలు బుజ్జగింపు, స్వార్థ రాజకీయాలు చేసే పార్టీలు.. ఈ మూడు పార్టీలు ఒకే తాను మొక్కలు.

బీఆర్ఎస్​.. కాంగ్రెస్​ పార్టీలు గతంలో అనేక సందర్భాల్లో పొత్తు పెట్టుకున్నాయి. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతు ఇచ్చిన, నరేంద్ర మోడీ గారిని, బీజేపీని విమర్శించారు. గతంలో కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్​ మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్​, కాంగ్రెస్‌తో ఎప్పుడూ కలవలేదు.. భవిష్యత్‌లో కలవబోవు. 12 మంది కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా..  చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్‌​లో కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారు.

కల్వకుంట్ల కుటుంబంతో కాపురం చేస్తున్నారు.. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ ఒక్కటే. ఈ మూడు పార్టీలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా సంతకాలు చేశాయి. తెలంగాణలో అవినీతి, కుటుంబ పార్టీకి, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు.. కుటుంబ, అవినీతి పార్టీలకు లేదు.." అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి  

Also Read: Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News