పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బండి సంజయ్..

స్వామి వారి ఆస్తులను కాపాడేందుకు పార్టీలకు అతీతంగా తరలిరావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాగా ఈ సాయంత్రం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

Last Updated : May 25, 2020, 11:03 PM IST
పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బండి సంజయ్..

హైదరాబాద్: స్వామి వారి ఆస్తులను కాపాడేందుకు పార్టీలకు అతీతంగా తరలిరావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాగా ఈ సాయంత్రం హైదరాబాద్ లో జనసేన అధినేత (Pawan Kalyan) పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో పలు తాజా అంశాలపై చర్చించినట్టు బండి సంజయ్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ ఆస్తులను అమ్మలనుకుంటే చూస్తూ ఊరుకోమని, తెలుగు రాష్ట్రాల సీఎంల కుట్రలను ప్రజలకు వివరించేందుకు కలిసి రావాలని పవన్ ను కోరినట్టు వెల్లడించారు. స్వామివారి ఆస్తులను కాపాడేందుకు కమిటీలు వేయాలి తప్పితే అమ్ముకోవడానికి కాదన్నారు. ప్రజలు ఆస్తులు అమ్ముకుని మొక్కలు తీర్చుకుంటే దేవుడు ఆస్తులను అమ్ముకునే అధికారం ఎవరూ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 

Also Read: TTD lands issue : టీటీడీ వివాదంపై పాత ఆధారాలు బయటపెట్టిన బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఇదిలాఉండగా తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్ సంసిద్ధత వ్యక్తం చేశారని, ఈ సందర్భంగా బండి సంజయ్ శ్రీవారి ఆస్తుల అమ్మకంపైనా స్పందించారు. టీటీడీ ఆస్తులను అమ్ముతామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. కాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్ వ్యవహార శైలిని పవన్ దృష్టికి తీసుకెళ్లానని చాలా అంశాలపై కూలంకషంగా చర్చించామని అయన అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here. 

Trending News