Bandi Sanjay: కాళేశ్వరం సందర్శనకు బీజేపీ బృందం.. అవినీతి లెక్క తేల్చేందుకేనా?

Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా మరింత దూకడు పెంచింది తెలంగాణ బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కమలం నేతలు.. కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించేలా వ్యూహాలు రచిస్తున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 28, 2022, 11:46 AM IST
  • త్వరలో కాళేశ్వరానికి బీజేపీ బృందం
  • అనుమతి కోరుతూ సీఎస్ కు సంజయ్ లేఖ
  • నీట మునిగిన పంప్ హౌజ్ లు పరిశీలన
Bandi Sanjay: కాళేశ్వరం సందర్శనకు బీజేపీ బృందం.. అవినీతి లెక్క తేల్చేందుకేనా?

Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా మరింత దూకడు పెంచింది తెలంగాణ బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కమలం నేతలు.. కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టులు లెక్క తేల్చే పనిలో ఉండగా.. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు   బీజేపీ   బృందానికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరారు బండి సంజయ్.

కాళేశ్వరం ప్రాజెక్ట్  సందర్శనలో   బీజేపీ పార్టీకి  చెందిన  ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్‌ ఎక్స్‌పర్ట్స్‌ మొత్తం  30 మంది ముఖ్యమైన ప్రతినిధులు ఉంటారన్నారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టును సెప్టెంబర్  మొదటి  వారంలో  బీజేపీ  బృందం  సందర్శిస్తుందని.. అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. భారీ వరదలతో నీట మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించడానికి  బీజేపీ  బృందం వస్తుందని లేఖలో వివరించారు బండి సంజయ్. 1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్‌ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శంచాయని చెప్పారు బండి సంజయ్‌. 2004 - 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై  వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని తన లేఖలో వివరించారు. ప్రభుత్వం కూడా ఇరిగేషన్‌ అధికారులను పంపించి తమ సందేహాలను నివృత్తి చేయాలని సీఎస్ ను కోరారు బండి సంజయ్‌.

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ పేరుతో ఏకంగా 94 వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే గత మూడేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అవసరమే రాలేదు. భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్ని నిండిపోయాయి. దీంతో లక్ష కోట్ల ప్రాజెక్ట్ వృధాగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వైట్ ఎలిఫెంట్ గా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగానే గత నెలలో వచ్చిన గోదావరి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్ లు నీటమునిగాయి. బాహుపలి మోటార్లు దాదాపు నెల రోజుల పాటు నీటిలోనే ఉండిపోయాయి. మోటార్ల రిపేర్లకే వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో కేసీఆర్ సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

నీట మునిగిన పంప్ హౌజ్ లను పరిశీలించేందుకు ఎవరిని అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన పీసీసీ నేతలను, వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీజేపీ నేతల పర్యటనకు పోలీసులు అనుమతి ఇస్తారా ఇవ్వరా అన్నది ఆసక్తిగా మారింది.

Read also: TRS MLA JUMP: బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే? కేంద్రమంత్రి డీల్.. త్వరలోనే ముహుర్తం

Read also: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ.. సంచలన విషయాలు వెలుగులోకి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News