తెలంగాణ బంద్.. నిర్మానుష్యంగా మారిన రోడ్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

Last Updated : Oct 19, 2019, 11:30 AM IST
తెలంగాణ బంద్.. నిర్మానుష్యంగా మారిన రోడ్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ సిబ్బంది ఎక్కడికక్కడ బస్సు డిపోల ముందు బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్.. ఇలా అన్ని జిల్లాలో ఆర్టీసీ కార్మికులు, పలు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అవాంచిత ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

ఆందోళనల్లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, వారి మద్దతుదారులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తడి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో విధుల్లో చేరిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సైతం ఇవాళ విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఒక్క బస్సు కూడా డిపో దాటి బయటికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. తెలంగాణ బంద్ నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే ఎంజీబీఎస్, జేబిఎస్ బస్టాండ్లు సైతం ఖాళీగా దర్శనమిచ్చాయి.

Trending News