Telangana Heavy Rains: వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయో తెలుసుకుందాం.
దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 4 రోజుల్లో ఇది కాస్తా అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 13-15 మధ్య వాయుగుండంగా మారవచ్చని అంచనా. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని 12 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మంచిర్యాల, నిర్మల్, ములుగు, వనపర్తి, అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం వివరాలు
ఇప్పటికే తెలంగాణలోని హన్మకొండ,కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎల్కతుర్తిలో 51 మిల్లీమీటర్లు, కొండాపూర్‌లో 45 మిల్లీమీటర్లు, కల్వకుర్తిలో 34 మిల్లీమీటర్లు, తెల్కపల్లిలో 33 మిల్లీమీటర్లు, జానూతలలో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం కురిసింది.
అటు హైదరాబాద్‌లో కూడా మోస్తరు వర్షం కురిసింది. ఎస్సార్ నగర్, మాదాపూర్, బోరబండ, మోతి నగర్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. రానున్న 3 రోజుల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తిరోగమన రుతు పవనాల ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులోని 8 జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేసింది ఐఎండీ. చెన్నై, పుదుచ్చేరి సహా 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Also read: Bank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.