Telangana: ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులందరూ పాస్‌: సబితా ఇంద్రారెడ్డి

TS News: ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌ చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 07:33 PM IST
Telangana: ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులందరూ పాస్‌: సబితా ఇంద్రారెడ్డి

TS News: ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల (Inter First year results)పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌ చేయనున్నట్టు  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indrareddy) తెలిపారు. ఇదే అంశంపై శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులందరిని కనీస శాతం(35శాతం) మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరిని పాస్‌ (Pass) చేయడం ఇదే చివరిసారని.. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండబోవని స్పష్టం చేశారు. 

మంత్రి మాట్లాడుతూ..‘‘'' కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నాం. దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పాం. 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేశాం. విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య చాలా కీలకం. 620 గురుకులాలను, 172 కస్తూర్బా కళాశాలలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేశాం.

Also Read: Jagga Reddy on Inter Results: ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే: జగ్గారెడ్డి

విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాం. తాజాగా ప్రకటించిన  ఫస్టియర్‌ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా..మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. అయితే ఫెయిలయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు. ఫస్టియర్‌ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్‌ చేయడం సరికాదు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు అందరినీ పాస్ చేస్తున్నామని'' సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News