Teenmaar Mallanna Fan Commits Suicide: తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక యువకుడు సూసైడ్

Teenmaar Mallanna Fan Ends Life In Nalgonda | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నల్లగొండ జిల్లాలో విషాదాన్ని నింపాయి. నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 21, 2021, 12:49 PM IST
  • నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానంలో టీఆర్ఎస్ విజయబావుటా
  • తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం
  • మల్లన్న ఓటమి జీర్ణించుకోలేక యువకుడు బలవన్మరణం చెందాడు
Teenmaar Mallanna Fan Commits Suicide: తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక యువకుడు సూసైడ్

Teenmaar Mallanna Fan Ends Life In Nalgonda : నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా మెజార్టీ సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై గెలుపొందారు. తద్వారా తన సిట్టింట్ స్థానాన్ని టీఆర్ఎస్ మరోసారి గెలుచుకున్నట్లయింది. బీజేపీ ఆశలు మరోసారి గల్లంతయ్యాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నల్లగొండ జిల్లాలో విషాదాన్ని నింపాయి. తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లంకలపల్లికి చెందిన శ్రీశైలం అనే 21 ఏళ్ల యువకుడు నేటి ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు శ్రీశైలంను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. తీన్మార్ మల్లన్న కోసం పాదయాత్రలో పాల్గొన్నాడు, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల(Telangana MLC Elections 2021 Results)లో ఓటమి చెందడాన్ని యువకుడు జీర్ణించుకోలేక తనువు చాలించాడు.

Also Read: Telangana MLC Elections 2021 Results: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ TRS విజయం

కాగా, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగు రోజులపాటు హోరాహోరీగా జరిగింది. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా చివరగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరో అభ్యర్థి తీన్మార్ మల్లన్న నిలిచారు. అయితే చివరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక ఆయన టీమ్ సభ్యుడు, అభిమానికి బలవన్మరణం చెందడం గమనార్హం.

Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు 

‘నల్లగొండ’ స్థానంలో మరోసారి పల్లా..
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం కౌంటింగింలో ఆదినుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి ప్రాధాన్యతలో విజయానికి కావాల్సిన మెజార్టీ ఎవరికీ రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా తీన్మార్ మల్లన్నపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు. గత ఆరు నెలలుగా దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. ఉమ్మడి జిల్లా మంత్రులు సన్నాహక సమావేశాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డాక్టర్లు.. కొన్ని ఇతర ఉద్యోగ సంఘాలకు ప్రాధాన్యమిచ్చి తన విజయానికి టీఆర్ఎస్ బాటలు వేసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News