Governor Tamilisai: నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది: గవర్నర్ తమిళిసై

Governor Tamilisai about Telangana government. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపిస్తోందన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన చెందారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 02:59 PM IST
  • ప్రధాని మోడీని కలిసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
  • నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది
  • గవర్నర్ పదవిని, కార్యాలయాన్ని గౌరవించాలి
Governor Tamilisai: నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది: గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan Says Telangana government insulted Office of Governor: తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపిస్తోందన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన చెందారు. తనను వ్యక్తిగతంగా అవమానించినా.. రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించానని, అలాగే చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు కూడా చేశానని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సమావేశం కొదిసేపటి క్రితమే ముగిసింది. ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుంచి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడంతో సహా రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల గురించి ప్రధానికి గవర్నర్ వివరించినట్టు సమాచారం. 

ప్రధానిని కలిసిన అనంతరం గవర్నర్ తమిళిసై విలేకరులతో మాట్లాడుతూ... 'నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. లేడీ గవర్నర్‌ను అవమానిస్తున్నారు. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. వ్యక్తిగతంగా నన్ను అవమానించిన భరిస్తా.. కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించా. అలాగే చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశా. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలి. వరంగల్ ఆస్పత్రి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి' అని అన్నారు. 

'గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది నా విచక్షణాధికారం. కౌశిక్ రెడ్డి పేరు సిఫారసు పైన నేను సంతృప్తి చెందలేదు. గతంలో ఇద్దరి పేర్లను ఆమోదించారు. నేను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలి. సీఎం ఏ విషయం పైన అయినా సరే నాతో నేరుగా వచ్చి చర్చించవచ్చు. కేంద్రం చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కృతజ్ఞతలు తెలియజేసాను, పుదుచ్చేరి-తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరాను. ట్రైబల్ గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అంశాల గురించి మాట్లాడాను' అని గవర్నర్ చెప్పారు. 

'రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయంకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి మీకు అందరికీ తెలుసు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. అందరితో స్నేహంగా ఉంటాను. నేను చాలా పారదర్శకంగా ఉంటాను. నేను ప్రజలతో, ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటాను. ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో వారికే తెలియాలి. నన్ను కాదు.. గవర్నర్ పదవిని, కార్యాలయాన్ని గౌరవించాలి. అయినా సరే నేను వేటినీ పట్టించుకోవడం లేదు' అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. 

'కౌశిక్ రెడ్డి వ్యవహారంలో అభ్యర్థిత్వం మీద నేను సంతృప్తి చెందలేదు. గతంలో ముగ్గురి విషయంలో ఆమోదం తెలిపాను. నేనేమీ వివాదాస్పదం చేయలేదు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఈ కారణాలు సాకుగా చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదు. అధికారులను సైతం హాజరు కాకుండా, ప్రోటోకాల్ అమలు చేయకుండా చేయడం సరైన చర్యేనా?. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదు. గవర్నర్‌గా ఎవరన్నా సరే.. ఆ పదవిని గౌరవించాలి. నేను చాలా సానుకూలంగా ఉండే వ్యక్తిని. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ తరహా ఉల్లాఘనలు సరైనవో కావో. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం నా పని కాదు.  ఉగాది సందర్భంలో కూడా ఆహ్వానాలు పంపాను. నేను ఎవరినీ ఇగ్నోర్ చేయలేదు. నాకు ఈగో లేదు' అని గవర్నర్ చెప్పుకోచ్చారు. 

Also Raed: పబ్‌కి వెళ్లడమే తప్పు అన్నట్టుగా.. నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: తమన్నా

Also Read: Bholakpur Corporator: ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News